అమరావతిలో మళ్లీ భూసేకరణ చట్టం, నాడు పవన్ కళ్యాణ్‌తో తగ్గారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి భూముల కోసం ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రయోగించనుంది. గతంలో ఓసారి భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, రైతుల ఆందోళన, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి, సీఎం చంద్రబాబు ససేమీరా అనడంతో వెనక్కి తగ్గింది.

భూసమీకరణలో పలువురు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నందున భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం నాడు విలేకరులతో మాట్లాడారు.

భూసేకరణకు వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. నవంబర్ మొదటి వారంలో ఈ నోటిఫికేషన్ ఉండవచ్చునని చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలో 300 ఎకరాల భూమిని సేకరించవలసి ఉందని తెలిపారు. లంక భూములు, ముంపు ప్రాంతాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

Capital issue: Andhra Pradesh moves to acquire land

తుది వరకు భూసమీకరణ ద్వారనే భూములు తీసుకోవాలని భావించామని కానీ, కొందరు భూసమీకరణలో ఇవ్వలేదని చెప్పారు. దీంతో భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. తుళ్లూరు ప్రాంతంలోని 21 గ్రామాల్లో 300 ఏకరాలు సేకరించనున్నట్లు చెప్పారు.

రెండు గ్రామాల్లో 150 ఇల్లు తొలగించవలసి ఉందని చెప్పారు. వారికి లంక గ్రామాల్లో పునరావాసం కల్పిస్తామన్నారు. తుళ్లూరు ప్రాంతంలో ఇప్పటికైనా భూసమీకరణకు సహకరిస్తే తాము అలా తీసుకునేందుకు సిద్ధమని చెప్పారు.
98 శాతం నుంచి 99 శాతం వరకు భూసమీకరణ పూర్తయిందన్నారు. కేవలం ముప్పై కుటుంబాలకు చెందిన 300 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందన్నారు. ఇప్పటి వరకు 31,359 ఎకరాలు సేకరించాలమన్నారు.

నవంబర్‌ 1నుంచి ఏపీలో శిరస్త్రాణం తప్పనిసరి

రాష్ట్రంలో నవంబర్‌ 1 నుంచి ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించడం తప్పనిసరి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రవాణా ఉప కమిషనర్‌ సుందర్‌ తెలిపారు. వాహదారులు శిరస్త్రాణం లేకుండా తొలిసారి పట్టుబడితే రూ.100 జరిమానా విధిస్తామన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనం జప్తు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+