తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పిన పెను ప్రమాదం: కాలువలోకి దూసుకెళ్లిన కారు, 6గురు సేఫ్

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జిల్లాలోని దుగ్గిరాల మండలం రెవేంద్రపాడు వద్ద పెనుప్రమాదం తప్పింది. విజయవాడ నుండి తెనాలి వెళుతున్న కారు రెవేంద్రపాడు వద్ద బకింగ్ హాం కెనాలోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటనలో 6 గురు ప్రమాదం నుండి బయటపడ్డారు. కాలువ ఉదృతం గా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రమాదం తప్పటం తో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

కాలువ అంచున చెట్లు ముళ్ల పొదలు ఉండటం తో వేగంగా దూసుకు వచ్చిన కారు కాలువ నీటి అంచుల్లో నిలిచిపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన స్థానికులు కారులో ఉన్న ఆరుగురిని అతి కష్టం గా బయటకు లాగారు. ఇది ఇలా ఉంటె ఈ రహదారి చాలా ప్రమాదకరం గా ఉంటుంది. గతం లోనూ ఇక్కడ ఇటువంటి ప్రమాదాలు ఎన్నో చోటుచేసుకున్నాయి. చాలా మంది కాలువలో కొట్టకుపోయి మృతదేహాలుగా తేలిన సంఘటనలు ఉన్నాయి.

 Car accident in Guntur: No one injured

అయినప్పటికి ఆర్ అండ్ బీ అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోవటం లేదు. రెవేంద్రపాడు నుండి తెనాలి వరకు సుమారు 15 కిలోమీటర్లు పైగా ఈ కాలువ ఒడ్డునే వాహనాలు ప్రయాణం కొనసాగిస్తాయి. గతం లో జరిగిన ప్రమాదాలతో మేల్కొన్న ఆర్ అండ్ బీ అధికారులు కొంతమేరకు మాత్రమే కాలువ ప్రక్క న ఐరన్ రెయిలింగ్ ఏర్పాటు చేశారు.

ప్రమాదం జరిగిన కొంత ప్రాంతం లో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. దీనితో ఆప్రాంతం మరింత ప్రమాద కరం గా మారింది. ప్రస్తుతం జరిగిన ఈ ప్రమాదం కారు అతివేగంగా వస్తుండగా, ఎదురుగా కుక్క అడ్డు రావడం తో తప్పించబోయి కాలువలోకి కారు దూసుకు వెళ్ళిందని డ్రైవర్ చెబుతున్నాడు. తెనాలి కి చెందిన ఓ కుటుంభం విజయవాడ లో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వర్ తో సహా కారులో ఇద్దరు పిల్లలు,ఒక వృద్ధుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. తృటిలో ప్రమాదం తప్పి పోవటం తో ప్రమాదం లో చిక్కుకున్న ఐదుగురిని స్థానికులు వేరే వాహనంలో పంపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి వాహన్నాన్ని కాలువనుండి బయటకు లాగించే ప్రయత్నం చేశారు.

భారీగా ఎర్రచందనం డంప్ స్వాదీనం: 6గురు స్మగ్లర్లు అరెస్ట్

తిరుపతి: కర్ణాటక రాష్ట్రం బొమ్మసంద్ర దగ్గర భారీ ఎర్రచెందనం డంప్ గుర్తించారు పోలీసులు.తమిళనాడుకు చెందిన సయ్యద్ గా ఈ స్మగ్లింగ్ నిర్వాహకుడు గా పోలీసులు తెలిపారు. ఈ డంప్ నుండి మొత్తం7.1 టన్నుల బరువుగల 235 దుంగలు స్వాధీనం చేసుకుని6 గురు స్మగ్లర్లు అరెస్ట్ చేశారు.

తిరుపతి అర్బన్ పోలీసులు కర్ణాటక రాష్ట్రంలో భారీ ఎర్రచందనం గోడౌన్ ను సీజ్ చేశారు. గోడౌన్ లో 7.1 టన్నుల యర్రచందనంను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. యర్రచందనం విలువ సుమారు3. కోట్లరూపయలు వుంటుదని పోలీసులు తెలిపారు. కర్ణాటకలో గుర్తించిన గోడౌన్ తమిళనాడుకు చెందిన స్మగ్లర్ సయ్యద్ ది గా తెలిపారు పోలీసులు.

ఇక్కడనుంచి తమిళనాడు, విదేశాలకు యర్రచందనాన్ని ఎగుమతి చేస్తారని పోలీసులు తెలిపారు. పట్టుబట్టి దుంగలు ఏగ్రేడ్ కు చెందినవి. గోడౌన్ కాపలాదారులు విగ్నేశన్, పెరియస్వామి, బాలకృష్ణ, శంకర్ లను వారితోపాటు తిరుపతి జీవకోనకు చెందిన ప్రసాద్, అభిషేక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
No one injured in a Car accident occurred in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X