వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు .. రీజన్ ఇదే
ఏపీలో లాక్ డౌన్ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో సామాజిక దూరం పాటించటం, మాస్కులు ధరించటం చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు . ఇక ఎవరైనా సరే లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నారు . ఇక ఇదే క్రమంలో నందికొట్కూరు వైసీపీ ఇన్‌చార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు .
కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఘోరంగా పెరుగుతున్న నేపధ్యంలో నిబంధనలకు కట్టుదిట్టం చేసిన అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. నియోజకవర్గంలో హైపో ద్రావణం స్ప్రే చేయించారు. రహదారులన్నీ శానిటైజ్ చేసే ఈ కార్యక్రమంలో బైరెడ్డి, లబ్బి వెంకటస్వామి ఇద్దరూ పాల్గొన్నారు.

అయితే స్ప్రే చేయిస్తున్న సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించలేదు. ఇక ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యాల్సిన నాయకులై ఉండి సామాజిక దూరం పాటించకపోవడంతో వారిపై కేసు నమోదైంది. ఈ కేసు వ్యవహారంపై బైరెడ్డీ సిద్ధార్థ రెడ్డి , లబ్బి కానీ ఇంతవరకూ స్పందించలేదు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఒకపక్క ప్రతిపక్ష పార్టీల నాయకులు సామాజిక దూరం పాటించటం లేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక సామాజిక దూరం పాటించకుంటే తమకు ఎవరైనా ఒకటే అంటున్నారు పోలీసులు . లాక్ డౌన్ నిబంధనలు అందరూ విధిగా పాటించాలని చెప్తున్నారు. పాటించని వారిపై పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications