వైసీపీ అనుకూల ఐపీఎస్ ల పై ఎఫ్‌ఐఆర్..!!
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పైన ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఏడుగురు అధికారుల పైన కేసులు వెంటాడుతున్నాయి. వైసీపీ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా నాటి పాలకులకు మద్దతు గా వ్యవహరించారని ఈ అధికారుల పైన ఆరపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అధికారులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వీరికి పోస్టింగ్ లు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఐసీఎస్ అధికారుల పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది చర్చకు కారణమవుతోంది.
ఐపీఎస్ లపై కేసులు
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు ఐపీఎస్ అధికారుల తీరు పైన పలు విమర్శలు ఉన్నాయి. ఈ జాబితాలో పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, కేకేఎన్ అన్బురాజన్, ఫక్కీరప్ప కాగినెళ్లి, సీహెచ్ విజయా రావు పేర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతస్థాయి వర్గాలలో వినిపిస్తున్నాయి. వీరిలో పలువురి పైన ప్రస్తుతం కేసుల కత్తి వెంటాడుతోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గతంలో నరసాపురం ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ పాలనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి తీసుకొచ్చి హింసించారనే ఆరోపణలు ఉన్నాయి.

వైసీపీకి అనుకూలంగా
అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఇటీవల ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యే రఘురామ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2021లో సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ అధిపతి పీఎ్‌సఆర్ ఆంజనేయులు తనను అంతమొందించే కుట్ర చేశారని పేర్కొన్నారు. దీంతో గుంటూరు పోలీసులు ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై హత్యాయత్నం కుట్ర కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరితో పాటు ప్రతిపక్షాలను హింసించడమే పనిగా వ్యవహరించిన విజయ్ పాల్ అనే అడిషనల్ ఎస్పీని సైతం నిందితుల జాబితాలో చేర్చారు.
చర్యలు తప్పవంటూ
శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడి నుంచి అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడి వరకూ ఎవరినీ వదలకుండా పీఎస్ఆర్ ఆంజనేయులు జైలుకు పంపారనే ఆరోపణలు ఉన్నాయి. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు జీవితం అర్ధాంతరంగా ముగిసి పోవడానికి ఈ ఐపీఎస్ అధికారి వేధింపులే కారణమని అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసాయి. ఈ అధికారులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పోస్టింగ్ లు ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వీరు ప్రతీ రోజు డీజీపీ కార్యాలయంలో సంతకాలు చేయాలని తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పుడు ఈ కేసులతో ఈ అధికారుల పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications