మత్తయ్య దారిలో జిమ్మీ బాబు: ఏపీలో దాక్కున్నాడంటున్న ఏసీబీ..!

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన తెలుగు యువత నేత జిమ్మీ బాబు కూడా ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య బాటలో నడుస్తున్నారని తెలుస్తోంది. కేసు నమోదు కాగానే మత్తయ్య ఏపీకి పారిపోయారని తెలంగాణ ఏసీబీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మత్తయ్యను అరెస్ట్ చేసేందుకు అన్ని విధాలా ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. కానీ చివరకు హైకోర్టు తీర్పుతో భంగపాటుకు గురయ్యారు. తాజాగా జిమ్మీ బాబు కూడా మత్తయ్య దారిలోనే ఏపీకి పారిపోయారని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

Cash-for-Vote Case: Gimme babu in andhra pradesh

ఓటుకు నోటు కేసులో జిమ్మీ బాబు ప్రమేయం ఉందని ప్రాథమికంగా నిర్ధారించుకున్న ఏసీబీ ఎలాగైనా సరే అతడిని అదుపులోకి తీసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో జిమ్మీ బాబు కోసం ప్రత్యేక బృందాన్ని కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

ఓటుకు నోటు కేసులో ప్రమేయంపై జిమ్మీ బాబుని విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ అధికారులు నోటుసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏబీసీ అధికారులకు మస్కా కొట్టి జిమ్మీ బాబు ఆంధ్రప్రదేశ్‌కు పారిపోయి అక్కడ తలదాచుకున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+