పోలీస్ స్టేషన్‌లో లోకేశ్‌పై ఫిర్యాదు, రేవంత్‌ను కలిసి టీటీడీపీ నేతలు

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీడీపీ కార్యకర్తల సంక్షేమ సమన్వయ కర్త నారా లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

''ఆయన (కేసీఆర్) గేమ్ ఆయనది.. మన ఆట మనది.. ఏసీబీ కేసులన్నీ మా నాన్న కాలిగోటితో సమానం'' అన్న లోకేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ న్యాయవాదులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తెలంగాణ ఏసీబీ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు అందజేయనున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ మంగళవారం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Cash for vote: Telangana tdp leaders met revanth reddy

అంతేకాదు 'చంద్రబాబు ఢిల్లీ స్థాయి రాజకీయాలు చేస్తుంటే, కేసీఆర్ మాత్రం గల్లీ రాజకీయాలు చేస్తున్నారు'అని లోకేష్ విమర్శించిన సంగతి తెలిసిందే.

రేవంత్‌ను కలిసిన టీటీడీపీ నేతలు

ఓటుకు నోటు కేసులో అరెస్టై చర్లపల్లి కారాగారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని బుధవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాములు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+