ఓటుకు నోటు కేసులో కీలక మలుపు, వారికి షాక్: సుప్రీం ఓకే, ఆళ్ల ఏమన్నారంటే
రెండేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటి దాకా పురోగతి లేదనే వాదనలు ఉన్నాయి.
హైదరాబాద్/అమరావతి: రెండేళ్ల క్రితం ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటి దాకా పురోగతి లేదనే వాదనలు ఉన్నాయి.
ఈ కేసులో పురోగతి లేదని, కొన్ని పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటుచేసుకుందని చెబుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
Recommended Video


ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా లేదని
తెలంగాణ ఏసీబీ ఈ కేసులో దర్యాప్తును నిష్పక్షపాతంగా చేయడం లేదని ఆళ్ల పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) దర్యాప్తుకు అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీం దాన్ని స్వీకరించింది.

త్వరలో విచారణ తేదీలు
దాంతో పాటు ఓటుకు కోట్లు ప్రధాన కేసుకు ఈ తాజా పిల్‌ని జత చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. విచారణ తేదీలను త్వరలో ఖరారు చేస్తామని కోర్టు తెలిపింది. సుప్రీం స్వీకరించడం టీడీపీ, రేవంత్ రెడ్డిలకు షాక్ అని అంటున్నారు.

తొలి, రెండో ఛార్జీషీట్ల మధ్య తేడా
ఓటుకు నోటు వ్యవహారం జరిగి రెండున్నరేళ్లు అయిందని, తదుపరి పరిణామాల నేపథ్యంలో విచారణలో జాప్యం చోటు చేసుకుందని, తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తు నిష్పక్షపాతంగా చేయడం లేదని మొదటి ఛార్జీషీటుకు, రెండో ఛార్జీషీటుకు వ్యత్యాసం ఉందని ఆర్కే తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని కోర్టు స్వీకరించింది.

ఆళ్ల హర్షం, బాబుది రుజువైంది, ముందుకుపోకుండా ప్రయత్నాలు
కోర్టు ఆదేశాలపై ఆళ్ల రామకృష్ణా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయాడని ఆరోపించారు. అయితే ఈ కేసు విచారణ ముందుకు జరగకుండా ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆడియో టేపుల్లో మాట్లాడింది చంద్రబాబేనని రుజువైందని, ఆయన పాత్ర బయటపడాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు.

ఆళ్ల లాయర్ మాట్లాడుతూ...
మరోవైపు, ఎమ్మెల్యే ఆర్కే లాయర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తు సరిగా చేయడం లేదన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. నిష్పక్షపాత దర్యాఫ్తు కోసం సీబీఐ విచారణ జరగాలని ఆర్కే పిటిషన్ వేశారన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications