టీ ప్రియులూ జాగ్రత్త! రైలు టాయ్‌లెట్లో టీ క్యాన్లు: ఏం జరిగింది?(వీడియో)
హైదరాబాద్: భారతీయులకు టీ(ఛాయ్)తో ఉన్న అనుబంధం విడదీయరానిది. దాదాపు అన్ని సమయాలు, సందర్భాల్లోనూ టీ తాగేందుకు మొగ్గు చూపుతారు. ఇక ప్రయాణాల్లో అయితే టీ తాగకుండా ఉండలేరు కొందరు.
అయితే, ఇప్పుడు మాత్రం రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ఈ వీడియో చూసిన తర్వాత టీకి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే.. టీ తీసుకొచ్చే క్యాన్లలో టీ అమ్మేవారు టాయ్‌లెట్లలోని నీళ్లను నింపడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.

టాయ్‌లెట్లలో టీ క్యాన్లు..
ఆ వీడియోను గమనించినట్లయితే.. ఓ టీ అమ్మే వ్యక్తి రైల్లోని ఓ టాయ్‌లెట్ డోర్ కొట్టి చాయ్ అనగానే అందులోంచి మరో వ్యక్తి మూడు చాయ్ క్యాన్లను అతని చేతికి అందించాడు. అందులో ఓ క్యాన్‌ని ఫ్లాట్ ఫాంపై ఉన్న మరో టీ అమ్మే వ్యక్తికి ఇచ్చాడు. మిగితా రెండు టీ క్యాన్లను వారిద్దరూ తీసుకెళ్లారు.

టాయ్‌లెట్ నీళ్లు కలిపారా? లేక..
అయితే ఆ టీ క్యాన్లలో టాయ్‌లెట్‌లోని నీళ్లు కలిపారా? లేక ఖాళీ క్యాన్లను ఆ టాయ్‌లెట్లోని నీళ్లు నింపి వాటితో టీ తయారు చేస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రశ్నిస్తే.. తడబడుతూ జారుకున్నారు..
లేదంటే రైలు కంపార్ట్ మెంట్లలో స్థలం లేకపోవడంతో మూడు టీ క్యాన్లు ఈ టాయ్‌లెట్లో పెట్టారా? అని మరికొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ తతంగాన్ని వీడియో తీసిన వ్యక్తి.. రైలు టాయ్‌లెట్ నుంచి టీ క్యాన్లు తీసుకెళ్లినవారిని ప్రశ్నించగా.. వారు సమాధానం చెప్పకుండా తడబడుతూ అక్కడ్నుంచి జారుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే..
అయితే, వీడియో తీసిన వ్యక్తి.. తెలుగులోనే మాట్లాడటంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రైళ్లలో టీ తాగే వారు జాగ్రత్తగా ఉండాలని మరికొందరు నెటిజన్లు సూచించారు. మరికొందరు.. ఈ వ్యవహారంపై రైల్వే శాఖ, సంబంధిత మంత్రి పీయూష్ గోయల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications