విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ హైకోర్టుపై సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్: మరో ఆరుమందిని అరెస్ట్ చేసిన సీబీఐ

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీ హైకోర్టు, న్యాయమూర్తులను ఉద్దేశించి వివాదాస్పదమైన వ్యాఖ్యలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేసిన కేసు దర్యాప్తు మరింత ముమ్మరమైంది. ఈ కేసుపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ జరుపుతోంది. న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిలో ఇప్పటికే సీబీఐ అధికారులు అయిదు మందిని అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు ఇప్పటికే నమోదు చేసిన 12 ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈ దర్యాప్తు సాగుతోంది. మొత్తంగా 16 మందికి నోటీసులను జారీ చేశారు.

కడపకు వైఎస్సార్ పేరు: కర్నూలు జిల్లాకు ఆ మాజీ సీఎం పేరు పెట్టకూడదా: పవన్ కల్యాణ్కడపకు వైఎస్సార్ పేరు: కర్నూలు జిల్లాకు ఆ మాజీ సీఎం పేరు పెట్టకూడదా: పవన్ కల్యాణ్

ఈ కేసు తాజాగా మరింత వేగం పుంజుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిలో మరో ఆరుమందిని సీబీఐ అధికారులు ఈ మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఇదివరకే అయిదుంది అరెస్ట్ అయ్యారు. తాజాగా మరో ఆరుమందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తంగా 11 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసును సీబీఐ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత- నిందితుల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వాటన్నింటినీ తొలగించారు.

CBI arrested 6 more accused in a case related to derogatory posts on social media against judg

ఏ కామెంట్స్ కూడా లేకుండా చేశారు. ఇంటర్నెట్ నుంచి కూడా అవి అందుబాటులో లేకుండా చేశారు. గత ఏడాది నవంబర్ 11వ తేదీన ఈ 16 మందిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మధ్యాహ్నం అరెస్టయిన వారిలో శ్రీధర్ రెడ్డి అవుతు, జలగం సత్యనారాయణ, గూడా శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిశ, కిషోర్ రెడ్డి దరిశ, సిద్ధులూరి అజయ్ అమృత్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వారందరూ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా భావిస్తున్నారు. ఇదివరకు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పులు వెలువడించిన సందర్భంలో వారంతా- న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా, అనుచితంగా తమ సోషల్ మీడియా అకౌంట్లల్లో పోస్టులు, కామెంట్లు చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ తమ దృష్టికి రావడంతో ఏపీ హైకోర్టు గత ఏడాదే ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

Recommended Video

YSRCP, TDP పై RGV సెటైర్..మధ్యలో ఆయన పై కూడా | Ap Politics || Oneindia Telugu

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, సచివాలయాలకు రంగులు, నర్సీంపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ అరెస్టు వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పులు వెలువడించిందంటూ వారు కామెంట్స్ చేశారని తెలుస్తోంది. అందులో
ఈ విషయంలో సీబీఐ అధికారుల నుంచి నోటీసులను అందుకున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుంటూరు జిల్లా బాపట్ల లోక్‌సభ సభ్యుడు నందిగాం సురేష్, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు ఆమంచి కృష్ణ మోహన్ కూడా ఉన్నారు. ఇదివరకే వారు విచారణకు హాజరయ్యారు.

English summary
CBI today arrested six more accused in an ongoing investigation of a case related to derogatory posts on social media against judges and the judiciary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X