డిజిపి దినేష్ రెడ్డిపై విచారణ దర్యాప్తు షురూ

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణపై దినేష్ రెడ్డిపై విచారణకు సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఐపియస్ అధికారి ఉమేష్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు దినేష్ రెడ్డిపై వచ్చిన ఆరోపణల మీద విచారణకు ఆదేశించింది.
1977 బ్యాచ్‌కు చెందిన దినేష్ రెడ్డి ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు వచ్చాయి. వీటిపై విచారణ చేపట్టి నాలుగు వారాల్లోగా నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications