నీకది నాకది: ఆ 8 కంపెనీల్లో జగన్‌కు సిబిఐ క్లీన్‌చిట్

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఆస్తుల కేసులో ఎనిమిది కంపెనీలలో క్విడ్ ప్రో కోకు ఆధారాలు దొరకలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) కోర్టుకు నివేదించింది. జగన్ ఆస్తుల కేసులో సోమవారం కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేసింది. అందులో ఎనిమిది సంస్థల వ్యవహారాల్లో క్విడ్ ప్రో కో ఆధారాలు దొరకలేదని తెలిపింది.

సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్, కార్మెల్ ఏసియా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్, పివిపి బిజినెస్ వెంచర్స్, జుబ్లీ మీడియా కమ్యూనికేషన్స్, క్లాసిక్ రియాల్టీ లిమిటెండ్/బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్ ప్రయివేట్ లిమిటెండ్, ఆర్ఆర్ గ్లోబల్ ఎంటర్ ప్రజెస్ ప్రయివేట్ లిమిటెడ్, సరస్వతీ పవర్ లిమిటెండ్, మంత్రి డెవలపర్స్.. ఈ ఎనిమిది సంస్థలలో నీకది నాకిది ఆధారాలు దొరకలేదని మెమోలో సిబిఐ పేర్కొంది.

ఈ కంపెనీలలో జరిగినట్లు చెబుతున్న నిబంధనల ఉల్లంఘన, అవకతవకల గురించి, ఆయా అంశాలు ఏయే శాఖల పరిధిలోకి వస్తాయో వాటికి నివేదించినట్లు కోర్టుకు విన్నవించారు. బ్రాహ్మణీ స్టీల్స్‌కు సంబంధించిన అంశం ఒఎంసి కేసు పరిధిలోకి వస్తుందని, దానిపై దర్యాఫ్తు ఇంకా కొనసాగుతుందని తెలిపింది.

కోల్‌కతా కేంద్రంగా ఉన్న 15 సూటుకేసు కంపెనీలు, గౌహతీలోని మరో కంపెనీ, కొన్ని సంస్థలు అక్రమాలు, ఉల్లంఘనలకు పాల్పడ్డాయని, ఇవన్నీ ఈడి, ఆధాయపు పన్ను శాఖ పరిధిలోకి వస్తాయని సిబిఐ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+