జగన్ పిటిషన్ పై మరో ట్విస్ట్..! సీబీఐకి కోర్టు కీలక ఆదేశం..!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే సుదీర్ఘంగా సాగుతున్న ఈ కేసు విచారణ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్ధితి. అదే సమయంలో తాజాగా జగన్ యూరప్ టూర్ కు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరడం, ఇవ్వడం జరిగాయి. అయితే జగన్ ఈ టూర్ ముగించుకుని తిరిగి వచ్చాక ఏం చేయాలో సీబీఐ కోర్టు వెల్లడించింది. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ జగన్ కోర్టులో మెమో దాఖలు చేసారు.
జగన్ యూరప్ టూర్ నుంచి తిరిగి వచ్చాక ఈ నెల 14న సీబీఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి గతంలో ఆదేశాలు ఇచ్చారు. దీంతో జగన్ యూరప్ టూర్ తర్వాత విచారణకు హాజరవుతారని అంతా భావించారు. కానీ జగన్ మాత్రం భద్రతా కారణాల రీత్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇవాళ సీబీఐకి కీలక ఆదేశం ఇచ్చింది.

జగన్ తన పిటిషన్ లో సీబీఐ కోర్టు తప్పనిసరిగా తాను హాజరు కావాలని భావిస్తే మాత్రం వస్తానని తెలిపారు. లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా కోర్టు విచారణకు హాజరవుతానని వెల్లడించారు. దీనిపై సీబీఐ అభిప్రాయం కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే జగన్ యూరప్ టూర్ లో తన ఫోన్ నంబర్ ఇవ్వకుండా మరో నంబర్ ఇచ్చారని, ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ షరతులు ఉల్లంఘించినందున దాన్ని రద్దు చేయాలని ఈ మధ్యే కోర్టును కోరింది.

అయితే కోర్టు అందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తాజా పిటిషన్ పై సీబీఐ స్పందన ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జగన్ కు సీబీఐ కోర్టు ఇచ్చిన గడువు 14వ తేదీకి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రేపు, ఎల్లుండిలో సీబీఐ తమ అభిప్రాయాన్ని సీబీఐ కోర్టుకు చెప్పాల్సి ఉంది. దాని ఆధారంగా జగన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలా వద్దా అన్న దానిపై సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications