జగన్ కేసుల అప్ డేట్ ఇదే-సుప్రీంకోర్టుకు ఇచ్చిన సీబీఐ,ఈడీ..!
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై గతంలో దాఖలైన అక్రమాస్తుల కేసుల్ని సీబీఐ, ఈడీ దశాబ్దానికి పైగా దర్యాప్తు చేస్తూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ కేసులపై తెలంగాణ హైకోర్టుతో పాటు హైదరాబాద్ సీబీఐ కోర్టులోనూ పలు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కూడా సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వీటిని త్వరగా తేల్చాలని, సీబీఐ, ఈడీ దర్యాప్తుల్ని ముగించాలని, అలాగే ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ గతంలో ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై గతంలో స్పందించిన సుప్రీంకోర్టు.. సీబీఐ, ఈడీ దర్యాప్తుతో పాటు డిశ్చార్జ్ పిటిషన్లపైనా అప్ డేట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇవాళ సీబీఐ, ఈడీ తమ అప్ డేట్ తో కూడిన అఫిడవిట్లను సమర్పించాయి. అలాగే జగన్ కేసుల దర్యాప్తు ఎందుకు ఆలస్యమవుతుందో కారణాల్ని కూడా అందులో వివరించాయి. ఈ నివేదికలు పరిశీలించిన తర్వాత రఘురామరాజు పిటిషన్ పై ఓ నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు ఇవాళ తెలిపింది. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేసింది.

గత విచారణలో సుప్రీంకోర్టు జగన్ కేసుల ఆలస్యంపై సీబీఐ, ఈడీకి అక్షింతలు వేసింది. రోజువారీ విచారణ జరగాలని చెప్పినా ఎందుకింత ఆలస్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తాజా వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ, ఈడీ తమ అఫిడవిట్లు సమర్పించాయి. వీటిలో ఆలస్యానికి కారణాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే జగన్ కేసుల విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలో వద్దో కూడా తేల్చనుంది.












Click it and Unblock the Notifications