Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వచ్చే ఎన్నికల్లో పోటీ - నియోజకవర్గం : తేల్చేసిన మాజీ జేడి లక్ష్మీనారాయణ..!!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. 2019 ఎన్నికల్లో లక్ష్మీనారాయణ జనసేన నుంచి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఎన్నికలు అయిన కొంత కాలానికే లక్ష్మీనారాయణ జనసేన వీడారు. అప్పటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిలిచిన ఆయన హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆయన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా న్యాయపోరాటం చేస్తున్నారు.

కొద్ది రోజులుగా ఆయన రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన తిరిగి జనసేనలో చేరుతారని.. ఏపీలో ఆప్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. లోక్ సత్తా తిరిగి రాజకీయంగా ఏపీలో బలోపేతం కోసం ఆయన పని చేస్తారంటూ కథనాలు వచ్చాయి. ఏపీ నుంచే లోక్ సత్తా జేపీ పోటీ చేయాలని ఆ పార్టీ తీర్మానం చేయటంతో..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల్లో పోటీ పైన ఆసక్తి నెలకొంది. ఇక, ఇప్పుడు మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

CBI Ex JD Laxmi Narayana Reveals about his contest in up coming elections

విశాఖ నుంచే స్వతంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తాన‌నే సంకేతాలు ఇచ్చారు. ఏ పార్టీ నుంచి తాను నిల‌బ‌డ‌బోన‌ని తేల్చి చెప్పారు. త‌న సొంత చ‌రిష్మాతోనే పోటీ చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. తన విజ‌యం ఖాయమని లక్ష్మీ నారాయణ ధీమా వ్యక్తం చేసారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేనాని పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కలిసారని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు అడ్డంకులు సరి కాదని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. దీంతో..ఇప్పుడు విశాఖ కేంద్రంగా చోటు చేసుకున్న మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో..ప్రతీ జిల్లా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మాజీ జేడీ చెప్పుకొచ్చారు.

ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు. విశాఖలో నాలుగు ప్రభుత్వ బిల్దింగ్ లు కట్టి ఉపయోగం లేదన్నారు. విశాఖను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. రాజధానుల పై సుప్రీం కోర్టుకు వెళ్లటంతో..ఆ తీర్పు వచ్చే వరకు నిరీక్షించాలని లక్ష్మీనారాయణ సూచించారు. అదే సమయంలో రాజకీయంగా చోటు చేసుకొనే పరిణామాలను గమనించాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+