చంద్రబాబును కలిసి ఇస్తా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రాజకీయాలపై..
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా ముక్కామలలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసమే తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు. తాను పరిశీలించిన సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నివేదిక ఇస్తానని చెప్పారు.
రాజకీయాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే అప్పుడే తాను రాజకీయాల గురించి ఆలోచిస్తానని చెప్పారు. అప్పటి వరకు రాజకీయ ఆలోచన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధి, వ్యవసాయరంగాలపై ఇష్టంతో తాను ఉద్యోగం వదిలేశానని చెప్పారు. రైతుల పిల్లలు వ్యవసాయంలోకి రావాలంటే వ్యవసాయ విద్యలో 5 శాతం రిజర్వేషన్లు కేటాయించాలన్నారు.

రెండు రోజుల క్రితం యువతతో మాట్లాడుతూ ఆయన టీవీ షో ప్రస్తావన తెచ్చారు. దేశానికి ఉపయోగపడే విధంగా యువత తయారుకావాలంటే కొన్ని పద్ధతులను పాటించాలన్నారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని, మెదడును మన కంట్రోల్లో ఉంచుకోవాలన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు మన శ్వాసను మన కంట్రోల్లో ఉంచుకుంటే మన మెదడు మన ఆదీనంలోనే ఉంటుందన్నారు.
ప్రాణాయామం ద్వారా దానిని సాధించవచ్చునని చెప్పారు. బిగ్‌బాస్ షో చూడటం కోసం యువత ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని వృథా చేసుకుంటోందన్నారు. ఈ షో మొత్తం బిగ్ బాస్ చెప్పినట్టు నడుస్తుందని, అందరి మెదడులను బిగ్ బాస్ కంట్రోల్ చేస్తుంటాడని, బిగ్ బాస్‌ను మాత్రం ఎవరూ కంట్రోల్ చేయరన్నారు. మన మెదళ్లను మన ఆదీనంలోనే ఉంచుకోవడానికి ప్రాణాయామం తప్పనిసరి అన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications