బిగ్‌బాస్‌లో స్టార్స్ వద్దు రైతులు కావాలి, చంద్రబాబుని అడిగా: లక్ష్మీనారాయణ
రాజమహేంద్రవరం: బిగ్ బాస్ షోను స్టార్స్‌తో కాకుండా రైతులతో నిర్వహించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆదివారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడలో నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సులో పాల్గొని, ప్రసంగించారు.
సామాజిక వర్గం కన్నా సమాజం ఎంతో ముఖ్యమని వ్యాఖ్యానించారు. పూర్తి ప్రజాస్వామ్యం వైపు ప్రజల ఆలోచలను మళ్లించాలన్నారు. రాజకీయ వ్యవస్థలో మంచి మార్పు తీసుకు రావాలన్నారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని స్టార్స్‌తో కాకుండా రైతులతో నిర్వహించాలని హితవు పలికారు.

జిల్లాలోని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని వేరుగా చెప్పారు. ఇప్పటికే ఆయన అపాయింట్‌మెంట్ కావాలని అడిగానని చెప్పారు. చంద్రబాబుతో అపాయింట్‌మెంట్ తేదీ ఫిక్స్ కాగానే తాను గుర్తించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్తానన్నారు.
ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు, మత్స్యకారుల సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను గుర్తించామని, ఓఎన్జీసీ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఓ నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి, సంబంధిత అధికారులకు అందజేస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications