అవినాష్ రెడ్డి అరెస్టుపై లోక్ సభ సెక్రటేరియట్ కు సీబీఐ సమాచారం..!

అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చిన తుది గడువు లోపు అవినాష్ రెడ్డిపై విచారణ పూర్తి చేసిన సీబీఐ.. అదనపు ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియడంతో తిరిగి కోర్టు ఇచ్చే ఉత్తర్వులు ఇప్పుడు కీలకంగా మారిపోయాయి. అదే సమయంలో గత నెలలో చోటు చేసుకున్న పరిణామాలపై సీబీఐ లోక్ సభకు తాజాగా ఓ రిపోర్ట్ పంపింది. ఇది తమకు అందినట్లు లోక్ సభ సచివాలయం నిర్దారించింది.
గత నెలలో వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ చాలా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా పలుమార్లు విచారణకు రప్పించి ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తారనేలా హంగామా చేసింది. ఈ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ముందస్తు బెయిల్ అయితే ఇవ్వలేదు కానీ.. దాదాపు దానికి సమానమైన నిర్ణయం తీసుకుంది. అవినాష్ ను తప్పనిసరి పరిస్దితుల్లో అరెస్టు చేయాల్సి వస్తే 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించింది.
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అవినాష్ రెడ్డిని గత నెలలో విచారణకు హాజరైన సందర్భంగా లాంఛనంగా అరెస్టు చేసి అదే రోజు విచారణ తర్వాత బెయిల్ పై విడుదల చేసేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేసి, విడుదల చేసినట్లు ఛార్జిషీట్ లో పేర్కొంది. అదే విషయాన్ని లోక్ సభ సచివాలయానికి కూడా తెలియజేసింది. ఈ మేరకు సీబీఐ తమకు జూన్ 30న సమాచారం ఇచ్చినట్లు లోక్ సభ సెక్రటేరియట్ తమ తాజా బులిటెన్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications