జగన్ బెయిల్ రద్దు కేసు-ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు-కోర్టుకే వదిలేసిన సీబీఐ
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ తన వాదనలు వినిపించేందుకు నిరాకరించింది. జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయాన్ని సీబీఐ కోర్టుకే వదిలేసింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేనని తెలిపింది. దీంతో సీబీఐ కోర్టు తన తీర్పు వెల్లడించేందుకు ఆగస్టు 25న డెడ్ లైన్ గా నిర్ణయించింది. అప్పటివరకూ పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది.

జగన్ బెయిల్ రద్దు కేసు
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఇవాళ మరోసారి హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ పై గతంలో వైఎస్ జగన్ కౌంటర్ దాఖలు చేయగా.. సీబీఐ మెమో దాఖలు చేసింది. వీటిపై పిటిషనర్ అయిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రీజాయిండర్ వేశారు. అయితే జగన్ బెయిల్ రద్దుపై ఏ నిర్ణయం తీసుకోకుండా వదిలేసిన సీబీఐని కోర్టు మరోసారి అభిప్రాయం చెప్పాలని కోరింది. దీంతో సీబీఐ ఇవాళ తమ అభిప్రాయాన్ని సీబీఐ కోర్టుకు వెల్లడించింది.

ఎటూ తేల్చని సీబీఐ
వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ అభిప్రాయం కీలకంగా మారింది. అయితే సీబీఐ మాత్రం తమ గత వాదనకే కట్టుబడింది. ఈ పిటిషన్ పై సీబీఐ కోర్టు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు విచక్షణ అధికారులకే నిర్ణయం వదిలేశామంటూ గతంలో దాఖలు చేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టును ఇవాళ మరోసారి సీబీఐ కోరింది. దీంతో ఈ పిటిషన్ పై తాము ఎలాంటి అభిప్రాయం చెప్పడం లేదని కోర్టుకు సీబీఐ తేల్చిచెప్పినట్లయింది.

సీబీఐ కోర్టు విచక్షణే కీలకం
జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ తమ అభిప్రాయం చెప్పకుండా కోర్టుకే నిర్ణయం వదిలేయడంతో ఇప్పుడు సీబీఐ కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. సాధారణంగా అయితే దర్యాప్తు సంస్ధల అభిప్రాయం మేరకే ట్రయల్ కోర్టులు తమ తీర్పులు వెలువరిస్తుంటాయి. కానీ ఇక్కడ సీబీఐ జగన్ బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న కీలక అంశంపై తమ అభిప్రాయం చెప్పకపోవడంతో ఈ వ్యవహారం తిరిగి సీబీఐ కోర్టు పరిధిలోకి వచ్చేసింది. దీంతో ఇప్పుడు సీబీఐ కోర్టు తమ విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయమే ఫైనల్ కానుంది.
Recommended Video

ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు
జగన్ బెయిల్ రద్దు కోరుతూ రఘురామ వేసిన పిటిషన్ పై గతంలోనే వైఎస్ జగన్ కౌంటర్, సీబీఐ మోమో, రఘురామ రీజాయిండర్ దాఖలు చేయడం జరిగిపోయాయి. కానీ సీబీఐ అభిప్రాయం చెప్పాలంటూ కోర్టు మరోసారి కోరినా సీబీఐ తమ పాత వాదనకే కట్టుబడటంతో ఇప్పుడు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగియడంతో తీర్పు కోసం సీబీఐ కోర్టు విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది. ఇప్పటికే పిటిషనర్ తో పాటు ప్రతివాదుల వాదనలు కూడా నమోదు కావడంతో జగన్ బెయిల్ రద్దుపై ఆగస్టు 25న సీబీఐ తీర్పు వెలువరించే అవకాశముంది.












Click it and Unblock the Notifications