CBI: MP అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ
Ys Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేసింది. పులివెందులలోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లిన సీబీఐ అధికారులు నోటీసులను అందజేశారు. సోమవారం విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులపై అవినాష్ రెడ్డి వెంటనే స్పందించి రేపు రావడం కుదరదని, తర్వాత వస్తానంటూ చెప్పారు. సోమవారం కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని సీబీఐ పట్టుబట్టింది.

గూగుల్ టేకౌట్ ద్వారా..
రేపు జరిగే విచారణకు అవినాష్ రెడ్డి తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. గతంలో పలుమార్లు అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసి ఆయనను విచారణకు పిలిచిం కీలక పరిణామాలపై ఆయనను లోతుగా ప్రశ్నించింది. హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలో చూపించినట్లు గూగుల్ టేకౌట్ అనే అప్లికేషన్ ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో హత్య జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? హత్యలో ఏమైనా పాత్ర ఉందా? ఏం చేశారు? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

మరోసారి నోటీసుల జారీ
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. రేపు సీబీఐ ఏం చేయబోతోందనే ఉత్కంఠ అందరిలో ఉంది. వివేకా హత్య కేసు దర్యాప్తలో సీబీఐ వేగం పెంచింది. కీలకమైనవారికి నోటీసులు జారీచేస్తోంది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా సీబీఐ నోటీసులు జారీచేసింది.












Click it and Unblock the Notifications