పండగ చేస్కోండి.. ఆ ప్రయాణికులకు టిక్కెట్లో పది శాతం రాయితీ ప్రకటించిన ఏపీఎస్ఆర్‌టిసి
మరికొద్దిరోజుల్లో దసరా పండుగ రాబోతుంది. ఈ తరుణంలో పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్‌టిసి ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. బస్సు టిక్కెట్లపై పది శాతం రాయితీ కల్పించింది. పండగ వేళ పట్టణాల్లో ఉండే చాలామంది ప్రజలు తమ సొంతూళ్లకు పయనమవుతారు. ఇలాంటి సమయాల్లో బస్సుల్లో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రద్దీనీ దృష్టిలో ఉంచుకునే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్‌టిసి ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బస్సు టిక్కెట్లపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సులు నిర్ణయం తీసుకున్నాయి.
ఈ రాయితీ విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ విషయాన్ని ప్రయాణికులకు గమనించగలరు. సెప్టెంబర్ 27వ తేది నుంచి అక్టోబర్ 5వ తేది వరకు ఆదివారం (అప్), శుక్రవారం (డౌన్)లను మినహా మిగిలిన రోజుల్లో టిక్కట్లపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఆర్‌టీసీ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.వై దానం శుక్రవారం నాడు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.

ఈ నెల 27 నుంచి...
అమరావతి బస్సుల్లో ఎంజీబీఎస్, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డాల్ఫిన్ క్రూయిజ్ కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770 ఉంది. అదే మిగిలిన రోజుల్లో మాత్రం రూ. 700 ఉంటుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 830 ఉండగా, మిగిలిన రోజుల్లో రూ. 750గా నిర్ణయించినట్లు ఆర్‌టిసీ అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు శుక్రవారం సాధారణ ఛార్జీ ఉంటుంది. ఇక, మిగిలిన రోజుల్లో రాయితీ ఛార్జీ వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బెజవాడ నుంచి బెంగళూరుకు బయులుదేరే వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ. 2170 గా నిర్ణయించారు. అదే బస్సు మిగిలిన రోజుల్లో చార్జీ రూ. 1970 ఉంటుందని అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 2210 ఉండగా, మిగిలిన రోజుల్లో ఛార్జీలు రూ. 2010 నిర్ణయించినట్లు తెలిపారు. వీటితోపాటు అమరావతి మల్టీ యాక్సిల్ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ.1870 ఉండగా, మిగిలిన రోజుల్లో సాధారణ ఛార్జీ రూ.1700 నిర్ణయించారు. ఇతర ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 1930 ఉండగా, మిగిలిన రోజుల్లో ఛార్జీలు రూ. 1750 గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ రాయితీ కేవలం ఈ నెల 27వ తేది నుంచి అక్టోబర్ 5వ తేది వరకు మాత్రమే ఉంటుంది.












Click it and Unblock the Notifications