సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?
ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి చేదు వార్త. నిర్మాణ రంగ సామాగ్రి ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్దమైంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ జ్వాలలు ఇప్పుడు నిర్మాణ రంగాన్ని తాకనున్నాయి. సిమెంట్.. స్టీల్ ధరలు భారీగా పెంచేందుకు కంపెనీలు సిద్దం అయ్యాయి. కొత్త ఆర్దిక సంవత్సరం వేళ అధికారిక ప్రకటన చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నిర్ణయం ఇప్పుడు సామాన్యులకు భారంగా మారనుంది.
సిమెంట్.. స్టీల్ ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్దం చేసారు. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీనితో ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తా ధర రూ.50 పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ ధరల పెరుగుదల వచ్చే వారం నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ.280-320 మధ్య ఉండగా, ఈ పెంపుదల తర్వాత రూ.320-370కి చేరనుంది. సిమెంట్ కంపెనీలు ఉపయోగించే పెట్రోలియం కోక్ ధర 130 డాలర్ల నుంచి 165 డాలర్లకు చేరడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేటు రూ.23.75 పెరగడం వంటి కారణాల వల్ల ఈ ధరల పెరుగుదల చోటుచేసుకుంది.

యుద్ద ప్రభావంతో ధరల పెంపు
అదే విధంగా స్టీల్ ధరలు భారీ పెరుగుతున్నాయి. స్టీల్ టన్ను రూ 2 వేల వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు మరియు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో, దేశీయంగా సిమెంట్ ధరలు పెంచాల్సి వస్తుందని కంపెనీ లు చెబుతున్నాయి. గత 15 రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 39%, థర్మల్ కోల్ (బొగ్గు) 14%, మరియు పెట్ కోక్ ధరలు 18% మేర పెరగడం సిమెంట్ తయారీదారులపై తీవ్ర భారాన్ని మోపింది.
సిమెంట్ ఉత్పత్తిలో ఇంధనం మరియు రవాణా ఖర్చులు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి, ఈ పెరుగుదల నేరుగా వినియోగదారుని జేబుకు చిల్లు పెట్టనుంది. నష్టాలను అధిగమించేందుకు మరియు ఉత్పత్తి వ్యయాన్ని సమన్వయం చేసుకునేందుకు కంపెనీలు సిమెంట్ బస్తాపై కనీసం ₹60 వరకు ధర పెంచాల్సిన అవసరం ఉందని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications