ఏపీకి అండగా కేంద్రం: శివరాజ్ సింగ్ చౌహాన్, చంద్రబాబుపై ప్రశంసలు

అమరావతి: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విజయవాడలో వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద విపత్తుపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​‌ను తిలకించారు.

వరద నష్టాన్ని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు లోకేష్, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు పాల్లొన్నారు. కాగా, బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్​ తెలిపారు.

Center will stand by Andhra Pradesh Shivraj Singh Chauhan Praises on Chandrababu

ఫొటో ఎగ్జిబిషన్ అనంతరం కేంద్రమంత్రి శివరాజ్ సింగ్.. చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సంభవించిన వరదల గురించి ప్రధాని మోడీకి వివరిస్తానని తెలిపారు. అంతే కాకుండా త్వరగా కేంద్ర సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ నివేదిక చూశాక, ఆర్థిక సాయం అందుతుందని ఇలాంటి కష్టసమయంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని శివరాజ్‌సింగ్‌ స్పష్టం చేశారు.

కాగా, గత ప్రభుత్వ హయాంలో బుడమేరు వద్ద ఆక్రమణలు పెరిగాయని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ మండిపడ్డారు. ప్రజలు ఐదు రోజులపాటు వరదనీటిలో ఉండిపోయారని వారి ప్రాణాలు కాపాడేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేశారని కొనియాడారు. దగ్గరుండి మరీ సహాయ కార్యక్రమాలు సీఎం చంద్రబాబు పర్యవేక్షించారని ప్రశంసించారు. వరద ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ సహాయ కార్యక్రమాలు బాగా చేశారని అభినందించారు. డ్రోన్ల ద్వారా ఫుడ్ ప్యాకెట్లు అందించడం దేశంలోనే తొలిసారని కేంద్రమంత్రి చెప్పారు. తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ తెలిపారు.

వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కలెక్టరేటునే సెక్రటేరీయేట్ చేసుకుని చంద్రబాబు.. ఆయన బృందం 24 గంటలూ పని చేశారని కేంద్ర మంత్రి కొనియాడారు. కాగా, ప్రకాశం బ్యారేజీ సామర్థ్యంపై అమిత్‌షా, నిపుణులతో చర్చిస్తామని శివరాజ్‌సింగ్‌ చెప్పారు. బుడమేరు సమీపంలో అక్రమ మైనింగ్ జరపడం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నట్లు తెలిసిందని తెలిపారు. కృష్ణా నది, బుడమేరు రెండూ ఒకే సారి పొంగాయని దీంతో గతంలో ఎన్నడూ చూడని జల ప్రళయాన్ని ఇప్పుడు విజయవాడ చూడాల్సి వచ్చిందన్నారు.

మరోవైపు, ప్రకాశం బ్యారేజ్‌కు 15 లక్షల క్యూసెక్కులు వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంకా బ్యారేజ్‌ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేస్తున్నామన్నారు. బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగుతోందని, శుక్రవారం నుంచి పనుల్లో పాల్గొంటుందని చంద్రబాబు తెలిపారు. కృష్ణా నది కరకట్టలు మరింత పటిష్టం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వర్షాలు, వరదలతో నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+