చంద్రబాబు రిక్వెస్ట్ కు మోదీ అంగీకారం..!!
ఏపీ పై కేంద్రం గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోంది. ఏపీకి కావాల్సిన సాయం అందించేందుకు సానుకూలంగా స్పందిస్తోంది. అమరావతి, పోలవరం, తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం...తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటన సమయంలోనూ ఏపీకి తాము పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ వేళ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సమయంలోనే కేంద్రం నుంచి ఏపీకి కీలక సమాచారం అందింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో ఏపీకి పెట్టబడుల కోసం చర్చలు చేస్తున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ వేళ..ఏపీకి కేటాయింపు అంశం పైన కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధనకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పోలవరం కు నిధులను కేంద్రం మంజూరు చేసింది. మొదటి దశ నిర్మాణం పూర్తి చేసేలా రూ 12 వేల కోట్లకు అంగీకరించింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అడ్వాన్స్ గా రూ 5 వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

ఏపీ ప్రభుత్వ వినతిని పరిశీలించిన కేంద్రం అందుకు అనుగుణంగా ఈ ఆర్దిక సంవత్సరంలోనే రూ 5 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఇప్పటికే తొలివిడతగా రూ.2,348 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రీయుంబర్స్‌మెంట్ కింద మరో రూ.459 కోట్లను కూడా మంజూరు చేసింది. అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభమైనందున అడ్వాన్సుగా ఇవ్వాల్సిన మిగతా రూ.2500 కోట్లను కూడా మంజూరు చేయాలని ఇటీవల కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి అంగీకరించిన కేంద్రం.. ఈ మేరకు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకుంది. వారంలో ఈ నిధులు ఏపీకి జమ కానున్నాయి.












Click it and Unblock the Notifications