ఎన్నికల వేళ ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..!!

ఏపీకి ఎన్నికల వేళ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ లో ఏపీకి రైల్వే కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇచ్చింది. నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన రైల్వే లైన్లను నిధులు కేటాయించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆరోబీలు, యూఆర్బీల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేసింది. గత బడ్జెట్ కంటే ఈ సారి నిధులు పెంచటంతో ప్రస్తుతం పెండింగ్ పనులు వేగం పుంజుకొనే అవకాశం కనిపిస్తోంది.

కేంద్రం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో 2024-25 లో ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం రూ 9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022-23 బడ్జెట్ లో రూ 7,032 కోట్లు, 2023-24 బడ్జెట్ లో 8,406 కోట్లు కేటాయించగా, గత ఏడాది కంటే ఈ ఏడాది రూ 732 కోట్లు అధికంగా కేటాయింపులు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. రైల్వే స్టేషన్లను డెవలప్ చేసేందకు ఈ బడ్జెట్ లో నిధులను కేటాయించించింది. కోటిపల్లి - నర్సాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి రూ 300 కోట్లు ప్రతిపాదించారు.

Central Allotted funds Rs 9138 cr Railways in latest budget for AP, priority for three new lines

విజయవాడ - గూడూరు మూడో లైన్ కోసం రూ 500 కోట్లు, కాజీపేట - విజయవాడ మూడో లైన్ కోసం రూ 310 కోట్లను కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించింది. విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లను రూ 209.8 కోట్లను మంజూరు చేసారు. అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషేన్ల అభివృద్ధికి రూ 425 కోట్లు కేటాయించారు.

ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, హైలెవల్ ప్లాట్ ఫారాల నిర్మాణానికి రూ 197 కోట్లు ప్రతిపాదించారు. ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు రూ 172 కోట్లు కేటాయించారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు రూ 30 కోట్లను కేంద్రం బడ్జెట్ లో అంచనాగా చూపించింది. రాష్ట్రం మీదుగా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణ కోసం రూ 10 కోట్లను బడ్జెట్ లో కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+