చంద్రబాబు, రేవంత్ కు పీఎం మోదీ బిగ్ రిలీఫ్ - భారీ సాయం..!!
భారీ వర్షాలతో నష్టపోయిన ఏపీ, తెలంగాణకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. గత వారం రోజులుగా రెండు రాష్ట్రాల్లోనూ వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరదల ప్రభావం...నష్టం పైన ప్రధాని మోదీకి లేఖ రాసారు. ఈ వరదలకు జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. తక్షణ సాయం ప్రకటించి ఆదుకోవాలని కోరారు. దీంతో, కేంద్ర విపత్తు టీంలను తెలుగు రాష్ట్రాలకు పంపారు. ఇదే సమయంలో కేంద్రం ఈ భారీ మొత్తంగా సాయంగా ప్రకటించింది.
కేంద్ర సాయం
ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోని వరద పరిస్థితి...నష్టం పైన వివరిస్తూ ప్రధానికి లేఖ రాసారు. తెలంగాణలో దాదాపుగా రూ 5,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాధమికంగా గుర్తించారు. ఈ వివరాలను రేవంత్ కేంద్రానికి నివేదించారు. తెలంగాణలో పర్యటించాలని ప్రధాని మోదీని కోరారు.రాష్ట్రంలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని అభ్యర్దించారు. తెలంగాణ కోసం తక్షణ సాయం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

సీఎంల అభ్యర్దన
అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాట్లాడారు. ఏపీలో వచ్చిన వరదల గురించి వివరించారు. భారీగా పంటనష్టం జరిగిందని..సామాన్య ప్రజలు భారీగా నష్టపోయారని వివరించారు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా టీంలు పంపాలని..తక్షణ సాయం ప్రకటించాలని అభ్యర్దించారు. చంద్రబాబు అభ్యర్దనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. హోం శాఖతో పాటుగా డిజాస్టర్ శాఖ అధికారులతో ఒక టీంను ఏపీకి పంపారు. అదే విధంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండు రాష్ట్రాలోనూ పర్యటించారు.
రూ 3,300 కోట్ల ఖరారు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముందుగా ఏపీలో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేసారు. భారీగా నష్టం జరిగిందని...కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం తెలంగాణలో ఏరియల్ సర్వే నిర్వహించారు. సీఎం రేవంత్ తోనూ భేటీ అయ్యారు. ప్రాధమిక నష్టం అంచనాలను రేవంత్ వివరించారు. కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు అండగా ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు సాయంగా రూ 3,300 కోట్లను విడుదల చేస్తున్నట్లు రెండు ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చింది.












Click it and Unblock the Notifications