Union Budget 2025: బడ్జెట్ లో ఏపీకి దక్కిందేంటి..!!

Union Budget 2025: కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ లో కీలక ప్రకటనలు చేసారు. మధ్య తరగతి ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చారు. ఆదాయ పన్ను పరిమితి రూ 12 లక్షలకు పెంచారు. రైతులు, మహిళలు, యువతకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రకటనలు చేసారు. ఎన్నికలు జరగనున్న బీహార్ పై ప్రత్యేక ప్రేమ చూపించారు. వరాలు ప్రకటించారు. ఇదే సమయంలో ఏపీకి చేసిన కేటాయింపుల పైన చర్చ మొదలైంది. ఇంతకీ, ఏపీ ఏం దక్కింది..

కేంద్ర బడ్జెట్ లో
కేంద్ర బడ్జెట్ వికసిత్ భారత్ లక్ష్యంగా నిర్ణయాలు ప్రకటించారు. బడ్జెట్ లో కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు పైన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపుకు ఆమోద తెలిపారు. దీని ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం అందు తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అదే విధంగా పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం బడ్జెట్ లో ప్రకటించారు. ఇక, బీహార్ లో ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్రానికి భారీ వరాలు కురిపించారు.

Central approved Polavaram revised Estimation for Rs 30 436cr in Union Budget 2025-26

బీహార్ కు ప్రాధాన్యత
బీహార్ లో మఖానా బోర్డు ఏర్పాటుతో పాటుగా ఐఐటీ విస్తరణ పైన ప్రకటన చేసారు. అదే విధంగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం పైన బడ్జెట్ ప్రసంగంలో హామీ ఇచ్చారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదించినట్లు నిర్మలా వెల్లడించారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందని నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

పోలవరానికి ఆమోదం
ఇక, బీహార్ కేటాయింపులతో ఏపీకి కేటాయింపుల పైన చర్చ జరుగుతోంది. అయితే, పోలవరం కు ప్రస్తుత బడ్జెట్ లో రూ 5,936 కోట్లు కేటాయించారు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు బడ్జెట్ లో వెల్లడించారు. పోలవరానికి కేంద్రం కేటాయించిన రూ 12,157 కోట్ల ను బడ్జెట్ లో ప్రస్తావించారు. రూ 30,436 కోట్లకు ఆమోదం తెలుపుతున్నట్లు వెల్లడించారు. అదే విధంగా 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అదే విధంగా విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీలోనూ ఏపీకి కేటాయింపు లు చేసినట్లు తెలుస్తోంది. అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+