తిరుపతి వెళ్లే భక్తులకు కేంద్రం భారీ వరం - కొత్తగా ఇక ..!!

తిరుమల - తిరుపతికి వెళ్లే భక్తుల కు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. తాజాగా రద్దీకి అనుగుణంగా టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్తగా దర్శనంలో ఏఐ అధారిత సేవలను ప్రారంభిస్తోంది. ఇదే సమయంలో అలిపిరిలోనే బేస్ క్యాంపు ఏర్పాటు ద్వారా వసతి..కౌంటర్లు అందుబాటులోకి తీసుకొ స్తోంది. ఇదే సమయంలో కేంద్రం తిరుపతికి వచ్చే భక్తుల కోసం కొత్త ప్రతిపాదనలకు పాలనా పరంగా - ఆర్దిక పరమైన అనుమతులను మంజూరు చేసింది.

తిరుపతిలో అద్భుతంగా
భక్తుల సౌకర్యం కోసం తిరుపతిలో కొత్త అద్బుతం సిద్దం అవుతోంది. భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్‌ను మరిన్ని కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ సిద్దమైంది. బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్‌కు స్కే వే సిద్దం కానుంది. దాదాపు రూ. 500 కోట్లతో జీ-ప్లస్ 10 అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. కొత్త హంగులతో తిరుపతి బస్ స్టేషన్ త్వరతోనే ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌గా మారబోతోంది. ఈ మేరకు కేంద్రం డిజైన్స్, డీపీఆర్ సిద్దం చేసింది. 13 ఎకరాల్లో ఉన్న తిరుపతి బస్టేషన్ లో ప్రస్తుతం 66 ప్లాట్ ఫాంలు ఉన్నాయి. నిత్యం దాదాపు 1.60 లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటూరు. దేశ వ్యాప్తంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం పూర్తి హంగులతో తీర్చి దిద్దాలని నిర్ణయించారు.

central-approves-budget-and-dpr-for-tirupati-integrated-bus-terminal

డిజైన్లు ఆమోదం
ఇందు కోసం నిర్మాణ బాధ్యతలకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్వీకరించింది. తాజాగా ఎన్‌హెచ్‌ఎం కమిటీ తిరుపతి రైల్వే స్టేషన్‌ను పరిశీలించింది. ప్రయాణికులకు కల్పించే సదుపాయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్ళు, మరుగుదొడ్లు, ప్లాట్‌ఫాంలు, కార్యాలయా , ఎంట్రెన్స్ ఎగ్జిట్ పాయింట్స్, నలువైపులా ఉన్న రహదారులు, బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్‌కు స్కైవే, అండర్ పాసింగ్ తదితర అంశాలపై చర్చించారు. దాదాపు రూ. 500 కోట్లతో జీ-ప్లస్ 10 అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇక ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్‌పై హెలి అంబులెన్స్ రాకపోకలు వీలుగా హెలిప్యాడ్ కూడా రాబోతోంది. వచ్చే 30 ఏళ్ల వరకు సమస్య లేకుండా నిత్యం 5 వేల బస్సుల రాకపోకలు, రెండున్నర లక్షల మంది ప్రయాణికుల సందర్శనకు అనుకూలంగా నిర్మాణాలు ఉండాలని డిపిఆర్ సిద్ధం చేసింది.

తిరుమల ఆలయ నమూనా
ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ నుంచి 22.1 కిలోమీటర్ వరకు తిరుమలకు నేరుగా రోడ్డు సౌకర్యం, రైల్వే స్టేషన్‌కి 800 మీటర్ల స్కైవే, 16.8 కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌కు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రహదారుల సౌకర్యం ఉండేలా డిజైన్లు సిద్ధమయ్యాయి. సెంట్ర బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు స్కైవే పేరుతో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించాలని డిజైన్ చేసారు. తిరుమల ఆలయ డిజైన్ లో ఈ నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+