ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - ఎన్నికల వేళ..!!
ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. పెద్ద మొత్తంలో నిధులను ప్రకటించింది.
ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కేంద్రం నుంచి గుడ్ న్యూస్ అందింది. కేంద్రం నుంచి ఏకంగా ఏపీలో ప్రాజెక్టుల కోసం రూ. 4,977 కోట్ల మేర నిధులు కేటాయించింది. ఏపీలో 85 రహదారి ప్రాజెక్టులకు ఈ మొత్తం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ లో కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ మొత్తం కేటాయింపులు చేసింది. ఏపీలో మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన సమయంలోనూ..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటన వేళ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందించారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన కేంద్రం..ఈ మేరకు ఏపీకి 85 రహదారి ప్రాజెక్టులకు ఈ మొత్తం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏపీలో కొత్తగా చేపట్టే 85 జాతీయ రహదారులు.. రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్రం రూ 4,977 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుల కింద కేంద్రం 2022 మార్చి వరకు రూ 5,098.98 కోట్లు ఖర్చు చేసింది. 2023-24 ఆర్దిక సంవత్సరంలో రూ 4,977.28 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ లో పేర్కొంది. ఇందులో ఆదునికీకరణ, మరమ్మతులు, విస్తరణ పనులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మాల కొండ నుంచి సింగరాయ కొండ వరకు ఉన్న జాతీయ రహదారి 167బి ఆధునికీకరణకు రూ 120.88కోట్లు, నాగార్జున సాగర్ డ్యాం నుంచి దావులపల్లి సెక్షన్ లో జాతీయ రహదారి 565కు రూ 146.31 కోట్లు కేటాయించారు. దుత్తలూరు నుంచి కావలి మధ్యలో ఉన్న ఎన్ హెచ్ 167బిజికి రూ 144.35 కోట్లు మంజూరు చేసారు. రాయచోటి నుంచి వేంపల్లి వరకు ఎన్ హెచ్ 440 విస్తరణకు రూ 143.36 కోట్లు మంజూరు చేసింది.

గుడివాడ- మిచిలీపట్నం, విజయవాడ - భీమవరం మధ్య రెండు ఆర్వోబీల నిర్మాణం, గుడవాడ బైపాస్ మరమ్మతులకు రూ 100.22 కోట్లు ఇచ్చారు. తాడిపత్రి - ముద్దునూరు మధ్య ఎన్ హెచ్ 67ని నాలుగు లేన్లుగా విస్తరించటానికి రూ 300.40 కోట్లు, ముదిగుబ్బ-పుట్టపరర్తి మద్య ఎన్ హెచ్ 342 కు రూ 100.72 కోట్లు, సోమయాజుల పల్లి -డోన్ మధ్య ఎన్ హెచ్ 340బి ఆధునీకరణ పనులు చేపట్టటానికి రూ 180.73 కోట్లు, సీతారామ పురం -దత్తలూరు మద్య ఎన్ హెచ్ 167 బిజీ విస్తరణకు రూ 120.07 కోట్లు, పుట్టపర్తి-కోడూరు సెక్షన్ లో ఎన్ హెచ్ 342 విస్తరణ కు రూ 300 కోట్లు, నంద్యాల-కర్నూలు-కడప సరిహద్దుల్లో ఉన్న ఎన్ హెచ్ 167కే సెక్షన్ ఆధునికీకరణకు రూ 200 కోట్లను ప్రతిపాదించారు. ఇవన్నీ 2023-24 వార్షిక బడ్జెట్ లో ప్రతిపాదించటం ద్వారా పనులు కూడా వేగంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఈ తాజా కేటాయింపులు ఆసక్తి కరంగా మారాయి.












Click it and Unblock the Notifications