వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర కేబినెట్ రేసులో ఏపీ -తెలంగాణ నుంచి ఆ ముగ్గురు: దక్కేదెవరికి..!?

|
Google Oneindia TeluguNews

కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం అవుతోంది. సంక్రాంతి తరువాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాల్లో ఎన్నికలు..2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలకు అనుగుణంగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ లో మొత్తంగా 83 మంది మంత్రులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 78 మంది ఉన్నారు. 2024లో హ్యాట్రిక్ లక్ష్యంగా కొత్త మంత్రుల ఎంపిక జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దక్కేదెవరికి అనేది ఆసక్తిగా మారుతోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే ఛాన్స్...

తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే ఛాన్స్...


ప్రస్తుత కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో పది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ప్రధాని మోదీ లక్ష్యంగా బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న సీఎం కేసీఆర్ ను ఓడించాలనేది బీజేపీ లక్ష్యం. వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈ సమయంలో తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి కేటాయించాలని బీజేపీ అధినాయత్వం భావిస్తోంది. మిగిలిన ముగ్గురు ఎంపీల్లో బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియనుంది. తిరిగి అధ్యక్షుడిగా కొనసాగిస్తారా లేక కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఈటలకు పార్టీ బాధ్యతలు ఇచ్చే అంశం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. బండి సంజయ్ ను ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చటం సరి కాదని బీజేపీ తెలంగాణ నేతలు అధినాయకత్వానికి సూచిస్తున్నారు.

బండి సంజయ్ - లక్ష్మణ్ లో ఎవరికి దక్కేను

బండి సంజయ్ - లక్ష్మణ్ లో ఎవరికి దక్కేను


తెలంగాణ నుంచి ప్రస్తుతం బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి కిషన్ రెడ్డి ఉండటంతో బీసీ వర్గానికి ఈ సారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అయితే, కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ ఇద్దరూ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారే. ఎస్టీ వర్గాలకు ఇవ్వాలని భావిస్తే అదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేరు పరిశీలనలోకి తీసుకొనే అవకాశం ఉంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ నాయకత్వం వద్ద మంచి మార్కులు సంపాదించారు. ఎన్నికల వరకు బండి సంజయ్ ను పార్టీ వ్యవహారాల నుంచి తప్పించకుండా..అదే పదవిలో కొనసాగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సామాజిక-నాయకత్వ- ప్రాంతీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే ధర్మపురి అర్వింద్ కు ఛాన్స్ కనిపిస్తోంది. అయితే, తెలంగాణలో కేసీఆర్ ను బలంగా కౌంటర్ చేసే నేతకే కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కుతుందని కమలం పార్టీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.

ఏపీ నుంచి ఈ సారి అవకాశం ఉంటుందా..

ఏపీ నుంచి ఈ సారి అవకాశం ఉంటుందా..

ఏపీ నుంచి ప్రస్తుతం బీజేపీకి లోక్ సభ సభ్యులు లేరు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, జీవీఎల్ ఉన్నారు. సీఎం రమేష్ టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. జీవీఎల్ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ కంటే తెలంగాణ బీజేపీకి రాజకీయంగా కీలకంగా మారుతోంది. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు దాదాపుగా బీజేపీకి అధికార - అనధికార మిత్రపక్షాలుగా ఉన్నాయి. దీంతో, ఏపీలో మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ దక్కటం దాదాపు లేదనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది. అనూహ్య మార్పులు జరిగి.. పవన్ కేంద్ర కేబినెట్ లో చేరే అవకాశం ఉంటే జనసేనానికి మినహా ఏపీ నుంచి ఎవరికీ కేంద్ర కేబినెట్ లో ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపించటం లేదు. అయితే, అనూహ్య నిర్ణయాలు తీసుకొనే బీజేపీ అగ్రనాయకత్వం ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.

English summary
Central Cabinet expansion may take place after pongal, three names in race from both Telugu states as per reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X