APప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రాష్ట్రంలోని గుత్తి- పెండేకల్లు రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న లైనును డబుల్ లైన్‌గా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 29.2 కిలోమీటర్లు. డబ్లింగ్ పనులు చేపట్టేందుకు రూ.352 కోట్ల వరకు కేంద్రం అంచనా వేసింది.
ఈ మేరకు అధికారులు పూర్తి వివరాలను తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని గుంతకల్ డివిజన్‌కు సంబంధించి గుత్తి- పెండేకల్లు సెక్షన్ అత్యంత ముఖ్యమైంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లన్నీ ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. ఈ రెండు మెట్రోపాలిటన్ నగరాలకు చెందినవారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ మార్గమే కీలకమైంది. ప్యాసింజర్ రైళ్లు, సరకు రవాణా రైళ్ల నిర్వహణలో మంచి వృద్ధి ఉండటంతో ఇక్కడ అభివృద్ధి పనులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రాకపోకలు కూడా సులువవుతాయి. మరిన్ని ఎక్కువ రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు కూడా ఎదురుచూపులు తగ్గడంతోపాటు వారి రవాణా కష్టాలన్నీ తిరిపోతాయి.
అందుకే వీటినన్నింటినీ దృష్టిలో డబ్లింగ్ చేయడానికి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. గుంతకల్లు నుంచి గుంటూరు వరకు ఉన్న మార్గాన్ని డబ్లింగ్ చేసే ప్రాజెక్టులో కూడా కొంత పురోగతి కనపడింది. ఈ పనులను కూడా రైల్వేశాఖ ఆమోదించింది. ఈ పనులు కూడా ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. ఇక మరో కీలకమైన సెక్షన్ గుత్తి- ధర్మవరం ను కూడా ఇటీలే డబుల్‌లైన్ సెక్షన్‌గా మార్చారు.
దీనివల్ల ఈ ప్రాంతాలకు చెందినవారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడినట్లవుతుంది. సరకు రవాణా రైళ్లు కూడా వేగంగా సరకులను చేరవేయడానికి వీలు కలుగుతుంది. ఇక్కడకు సమీపంలోని పరిశ్రమలకు కూడా ప్రయోజనం దక్కుతుందని భావిస్తున్నారు. రైళ్ల సగటు వేగం పెరగడంవల్ల ప్రయాణికులకు చాలా సమయం ఆదా అవనుంది.












Click it and Unblock the Notifications