ఏపీకి కేంద్రం బిగ్ రిలీఫ్ - సరైన సమయంలో..!!

కేంద్రం నుంచి ఏపీకి గుడ్ న్యూస్. ఆర్దిక సంవత్సరం చివరి నెలలో ఆర్దికంగా బిగ్ రిలీఫ్ దక్కింది.

కేంద్రం నుంచి ఏపీకి గుడ్ న్యూస్. ఆర్దిక సంవత్సరం చివరి నెలలో ఆర్దికంగా బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ నెలలో ఆర్దికంగా ఏపీ ప్రభుత్వం పైన చెల్లింపుల భారం ఉంది. అదే సమయంలో ఉద్యోగులకు బకాయిల చెల్లింపు పైన ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రూ 3వేల కోట్ల రూపాయాలు ఉద్యోగులకు ఈ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంది. ఈ నెలలోనే 2023-24 ఎన్నికల బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ఏపీ కి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా రెండు ఇన్ స్టాల్ మెంట్స్ ను కేంద్రం విడుదల చేసింది.

నీతి అయోగ్ సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటాలో 41 శాతం చెల్లించాల్సి ఉంది. అందులో భాగంగా కేంద్రం తాజాగా రాష్ట్రాలకు రావాల్సిన వాటాను విడుదల చేసింది. కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటా కింద రూ 1,40,318 కోట్లు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ 5,474 కోట్లు విడుదల అయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి రూ 2,682 కోట్లు వాటాగా విడుదల చేసినట్లు కేంద్ర ఆర్దిక శాఖ వెల్లడించింది. అన్ని రాష్ట్రాల కంటే ఉత్తరప్రదేశ్ కు పన్నుల వాటాగా రూ 24783 కోట్లు విడుదల చేసారు. మధ్య ప్రదేశ్ కు రూ 11108 కోట్లు మంజూరు చేసారు. బీహార్ కు రూ 14,232 కోట్లు వాటాగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా రాష్ట్రాలకు గతంలో వచ్చిన పన్నుల వాటా కంటే మెరుగ్గా ఆదాయం సమకూరుతోందని కేంద్ర ఆర్దిక శాఖ చెబుతోంది.

Central Government has released the tax devolution to the AP Govt for rs 5,474 cr and and Rs 2,682 cr for TS

ఏపీలో ప్రస్తుత ఆర్దిక సంవత్సరం చివరి మాసంలో ఈ నిధులు ఉపశమనం కలిగిస్తున్నాయి. కేంద్రం పన్నుల వాటా ను ప్రతీ బడ్జెట్ లోనే ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సారి బడ్జెట్ కు సంబంధించి ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. 14వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ఏడాది కావటంతో ఈ సారి బడ్జెట్ లో సంక్షేమంతో పాటుగా ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కేంద్రం నుంచి అయిదు వేల కోట్లకు పైగా నిధులు విడుదల కావటంతో ప్రస్తుత ఆర్దిక సమస్యల్లో రిలీఫ్ దక్కనుందని అధికారులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+