అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!!
ఏపీకి కేంద్రం నుంచి మరో గుడ్ న్యూస్ అందింది. అమరావతి కేంద్రంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమరావతికి చట్టబద్దత కల్పించిన కేంద్రం.. ఇప్పుడు రాజధాని కేంద్రంగా రూ 2,534 కోట్ల ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి అధికారికంగా సమాచారం అందుతోంది. వచ్చే వారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయానికి సంబంధించి ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ద్వారా అమరావతికి కొత్త రూపు రానుంది.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.2,534 కోట్లతో అమరావతిలో కేంద్రం భారీ నిర్మాణాలను చేపట్టనుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం రూ.1,299.08 కోట్లు, నివాస సముదాయాల ఏర్పాటు కోసం రూ.1,234.91 కోట్లతో కూడిన మెమోరాండం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే కేబినెట్ సెక్రటేరియట్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు క్లియరెన్స్ కోసం తుది కసరత్తు జరుగుతోంది. గతంలోనే ఈ ప్రతి పాదనల పైన ప్రాధమికంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఆమోదం దిశగా వేగంగా కేంద్రంలో అడుగు లు పడుతున్నాయి. కాగా.. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ వెలువడిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఏపీ అధికారులు ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్‌కు సమర్పించారు. వచ్చే కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి లభించే అవకాశం ఉంది.

అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు
ఇక, ఈ భారీ ప్రాజెక్టు తదుపరి అనుమతులకు కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్ ఉంది. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఫైల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టు పైన ప్రాధమిక చర్చల సమయంలోనే అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.53 ఎకరాల భూమిని కేటాయించారు. సీపీడబ్ల్యూడీ కోసం 22.53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఇందులో 5.53 ఎకరాలు సెక్రటేరియట్ నిర్మాణానికి, 17 ఎకరాలు నివాస సముదాయా ల ఏర్పాటుకు కేటాయించారు. కేబినెట్ సెక్రటేరియట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు వేగవంతం చేసే అవకాశం కనిపిస్తోంది. వచ్చే వారం జరిగే కేబినెట్ భేటీలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం.
-
అమరావతి ఇక ప్రత్యేకంగా - తాజా నిర్ణయం, కీలక మలుపు..!! -
నియామకాలు- పోస్టుల్లో కొత్త మార్పులు, ఉద్యోగుల బదిలీల పై కీలక నిర్ణయం .. ఇక నుంచి..!! -
కొత్త ఇళ్లు, స్థలాల పై ప్రభుత్వం కీలక నిర్ణయం- అర్హుల జాబితా.. పంపిణీ ముహూర్తం..!! -
రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు- ఆధారాలతో సహా.. ఇక నెక్స్ట్..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - నెక్స్ట్ 24 గంటల్లో నిధుల జమ..!! -
పాదయాత్ర ఇంకా ముందే ప్రారంభం: 'మావిగన్' ఆషామాషీగా చెప్పలేదు- జగన్..!! -
మావిగన్ పై స్పందన చూసి చంద్రబాబుకు వణుకుపుడుతోంది! -
Amaravati: అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
ఏపీలో మళ్లీ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్లు ? చంద్రబాబు అమరావతిపై ధర్మాన ఫైర్..! -
Rushikonda: ఆ నలుగురిలో ఒకరికి రుషికొండ-సర్కార్ ఛాయిస్ ఎవరో ? -
పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు షాక్-తాజా ఉత్తర్వులు..! -
సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే! -
విశాఖ వాసులకు వేస్ట్ టు వండర్ ఛాలెంజ్.. ఏకంగా రూ.22.5లక్షల నగదు బహుమతులు -
ఏపీలో ఆ ఉద్యోగులకు 9, 23న పెయిడ్ హాలిడేలు..! రీజన్ ఇదే..!













Click it and Unblock the Notifications