అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టు కర్నూలుకు తరలింపు పై తేల్చేసిన కేంద్రం..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ హైకోర్టు తరలింపు పైన కేంద్రం తన వైఖరి స్పష్టం చేసింది. పార్లమెంట్ లో క‌ర్నూల్‌కు హైకోర్టు త‌ర‌లింపుపై వైఎస్సార్సిపి ఎంపీలు కోట‌గిరి శ్రీధ‌ర్‌, చింతా అనురాధ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి న్యాయ‌శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి సమాధానం ఇస్తూ.. ఏపీ హైకోర్టును అమ‌రావ‌తి నుంచి క‌ర్నూల్‌కు త‌ర‌లించాల‌నే ప్ర‌తిపాద‌న కేంద్రానికి అందిందని స్పష్టం చేసారు. అదే సమయంలో క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై హైకోర్టుతో సంప్ర‌దింపులు జ‌రిపి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యం తీసుకోవాలని పేర్కొన్నారు.

పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి

పార్లమెంట్ వేదికగా కేంద్ర మంత్రి


హైకోర్టు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌న్నీ రాష్గ్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుందని వెల్లడించారు. హైకోర్టును క‌ర్నూల్‌కు త‌ర‌లింపుపై రాష్ట్ర ప్ర‌భుత్వం, హైకోర్టు క‌లిసి ఒక నిర్ణ‌యానికి రావాల్సి ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత ఆ ప్ర‌తిపాద‌న‌లు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో అమరావతిలో జరగుతున్న హైకోర్టు శాశ్వత నిర్మాణాలను పూర్తి చేయాలని కోర్టు సూచించింది. సీఎం జగన్ న్యాయ రాజధానిగా కర్నూలును ప్రతిపాదించారు. అయితే, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తమ బిల్లులను ఉప సంహరించుకుంది.

హైకోర్టు - ఏపీ ప్రభుత్వం నిర్ణయించాలి

హైకోర్టు - ఏపీ ప్రభుత్వం నిర్ణయించాలి


హైకోర్టు సైతం రాజధానిగా అమరావతినే కొనసాగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల పైన ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు కూడా వెళ్లలేదు. కోర్టు ఆదేశాల అమల్లో భాగంగా... అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది. అయితే, న్యాయ రాజధానిగా ప్రతిపాదించిన కర్నూలుకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్న లోకాయుక్త, విజిలెన్స్ కార్యాలయాలను తరలించింది. కానీ, హైకోర్టు మార్చాలంటే మాత్రం న్యాయపరంగా కొన్ని చిక్కుముడులు ఉన్నాయి.

న్యాయపరమైన చిక్కులే అడ్డంకి

న్యాయపరమైన చిక్కులే అడ్డంకి


హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే... ముందు ఈ నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్తది జారీ చెయ్యాలి. అమరావతిలో హైకోర్టు... రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైంది. ఇప్పుడు కర్నూలుకు హైకోర్టు తరలించాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో.. కర్నూలుకు హైకోర్టు తరలింపు పైన ఇప్పుడు కేంద్రం ఇచ్చిన స్పష్టతతో ..ఏపీ ప్రభుత్వం ఏ రకంగా ముందుగు వేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Central Minister response on AP high court shifting to kurnool in parliament, Says decsion to be finalized by high court and govt of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X