పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..తెలుగోడికి ఒడిశా బాధ్యతలు

దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది.అలాగే పలువురు గవర్నర్లు వివిధ రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల గవర్నర్లలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు, మణిపూర్ గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా, మిజోరాం గవర్నర్‌గా విజయ్ కుమార్ సింగ్, బిహార్ గవర్నర్‌గా అరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్‌లను నియమించారు.

గవర్నర్ల నియామకాలు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అమలులోకి వస్తాయని రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న డాక్టర్‌ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు. కంభంపాటి హరిబాబు ప్రకాశం జిల్లాలోని తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్​ చేశారు. తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్​డీ పొందారు.

Central govt has appointed governors to many states

ఆంధ్రా విశ్వవిద్యాలయంలోనే అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేసి 1993వ సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఏపీ భాజపాలో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగానూ సేవలందించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ తల్లిని విజయమ్మని ఓడించిన నేతగా కంభంపాటి హరిబాబుకు మంచి గుర్తింపు ఉంది. 2021 జులైలో తొలిసారి ఆయన మిజోరం గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు ఒడిశా బాధ్యతలు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+