ప్రధాని రాక వేళ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ - అక్కడే అసలు ట్విస్ట్..!!
ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటిం చారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం పై ఒత్తిడి పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల పైన ఒత్తిడి పెరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పైన ప్రధాని స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఈ సమయంలోనే స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం కొత్త ప్రతిపాదనతో సిద్దం అయినట్లు తెలుస్తోంది. కానీ, దీనిని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
ప్యాకేజీ ప్రతిపాదన
ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలో కేంద్రం స్టీల్ ప్లాంట్ పైన కీలక నిర్ణయం దిశగా అడు గులు వేస్తోంది. స్టీల్ ప్లాంట్ కు రూ.17 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు సిద్దం అయినట్లు సమాచారం. అయితే, ప్లాంట్ కు నిధులుగా కాకుండా టెక్నాలజీ రూపంలో ఇవ్వాలని భావిస్తున్న ట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ ప్లాంటులో మూడు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా స్టీల్ తయారు చేస్తు న్నారు. ప్లాంట్ కు ఉన్న ఆర్దిక ఇబ్బందులతో ముడి పదార్ధాలను సమకూర్చుకోవటం సమస్య గా మారుతోంది. దీంతో, రెండు బ్లాస్ట్ ఫర్నేసులనే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసుల ఏర్పాటు కోసం నిధులు ఇవ్వనున్నట్లు చెబుతున్నారు.

కేంద్రం ఆలోచన
ఈ కొత్త ఫర్నేసుల ఏర్పాటు కోసం ఒక్కొక్క దానికి రూ.2,500 కోట్ల నుంచి రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. మూడింటికీ రూ.7,500 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. వీటి ద్వారా నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేస్తారు. లాంగ్ ప్రొడక్టులు, భవన నిర్మాణాలు, మౌలిక వసతు ల రంగంలో అధికంగా ఉపయోగించే స్టీల్‌ను తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేయాలనేది ప్రణాళిక కేంద్రం సిద్దం చేసినట్లు సమాచారం. అయితే, ఈ మేరకు కావాల్సిన సాంకేతిక సాయం అందించేందుకు పోస్కో కంపెనీ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ నాలుగేళ్ల క్రితమే విశాఖ ఉక్కుతో జాయింట్ వెంచర్ కోసం ప్లాంటులో 1,500 ఎకరాలు కేటాయిస్తే స్టీల్ ఉత్పత్తి చేసి, లాభాల్లో వాటా ఇస్తామని అప్పట్లో ప్రతిపాదన చేసింది.
కార్మికుల వాదన
కానీ, కార్మిక సంఘాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ప్లాంట్ ప్రయివేటీకరణ లో భాగంగా ఈ ప్రతిపాదన చేస్తున్నారని నిరసనలకు దిగాయి. దీంతో, ఈ ఆలోచన అమలు కాలేదు. కాగా, ఇప్పుడు కేంద్రం విశాఖ ఉక్కులో ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్పత్తి పెంచాలని భావిస్తోంది. దీని కోసం కొత్త టెక్నాలజీ వినియోగం పైన ఫోకస్ చేసింది. అయితే, కేంద్రం తీసుకొచ్చే కొత్త ఫర్నేసుల తో పెద్దగా ఉత్పత్తి పెరిగే అవకాశం లేదని కార్మికులు చెబుతున్నారు. ప్లాంట్ కు కావాల్సిన ఆర్దిక సాయం చేయకుండా తాజా ప్రతిపాదనలతో ఉపయోగం ఉండదని వాదిస్తున్నారు. ఈ ప్యాకేజీ పేరుతో మరోసారి పోస్కోను తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో, ఇప్పుడు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రతిపాదన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనది ఆసక్తి కరంగా మారుతోంది.
-
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications