జగన్‌ పాలనపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేంద్రమంత్రి బండి సంజయ్ గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండి సంజయ్ జగన్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు తిరుమల శ్రీవారి పేరుతో దందాలు చేసారని... స్వామివారి ఆస్తులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మొన్నటివరకు నిలువు నామాలు పెట్టుకుని తిరుమలలో కనిపించిన వారు ప్రజలకు పంగనామాలు పెట్టారని వైసీపీ నాయకులను ఆయన విమర్శించారు. అన్యమతస్తులకు పదవులిచ్చి హిందూ ధర్మంపై దాడి చేసారని బండి సంజయ్ అన్నారు.

పదవుల కోసం టీడీడీని వాడుకున్న నయవంచకుల పాలన ముగిసిపోయిందని... నిత్యం వెంటేశ్వర స్వామి నామస్మరణ చేసే సేవకుల రాజ్యం వచ్చిందంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.శ్రీవారి ఆస్తుల దోపిడీపై నివేదిక కోరతామని... దాని ఆధారంగా దోపిడీదారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతానని ఆయన తెలిపారు.ఎర్రచందనం చెట్లను అక్రమంగా కొట్టేసి ఇతర దేశాలకు స్మగ్లింగ్ చేశారని... ఇలా వేలకోట్లు సంపాదించారని అన్నారు.

central minister bandi sanjay fires on ysrcp leaders

ఈ ఎర్రచందనం స్మగ్లర్లు సర్కారుకే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారంటే ఏ స్థాయిలో దోపిడీ సాగిందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. గత పాలకులు తిరుమలలో లంగ దందాలు చేశారని సంజయ్ మండిపడ్డారు. సొంత ఆస్తుల కోసం ఏడుకొండలవాడి ఆస్తులను కొల్లగొట్టారని ఆయన దుయ్యపట్టారు. ఏడుకొండలవాడిని రెండుకొండలవాడిటా చూపించే ప్రయత్నం చేశారని... కానీ చివరకు ఆ దేవుడి ఆగ్రహానికి గురయి అధికారాన్నే కోల్పోయారని అన్నారు. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వెంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+