స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రులు- కీలక పరిణామాలు, వాట్ నెక్స్ట్..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రం తాజాగా స్టీల్ ప్లాంట్ కు రూ 11,440 కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. కానీ, ప్లాంట్ భవిష్యత్ పైన నమ్మకం కలగటం లేదు. ఈ సమయంలోనే కొన్ని కీలక అంశాలు చర్చకు వస్తున్నాయి. దీంతో.. కేంద్ర మంత్రి కుమార స్వామి ప్లాంట్ లో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. ప్లాంట్ అప్పులు .. ఆర్దిక పరిస్థితి.. ఉత్పత్తి పై క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే, కార్మిక సంఘాలు మాత్రం ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయించాలని కోరుతున్నారు.

ప్లాంట్ కు కేంద్ర మంత్రులు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర మంత్రి కుమార స్వామి రావటం ఆసక్తి కరంగా మారుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై అధికా రులతో సమీక్షించడంతోపాటు, కార్మిక సంఘాలతో సమావేశం అవుతారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ సద్వినియోగంతో పాటుగా పూర్తి స్థాయి ఉత్పత్తే లక్ష్యంగా దిశా నిర్దేశం చేయనున్నారు. అయితే, ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ఇచ్చినా కొన్ని కీలక అంశాల్లో పీటముడి కొనసాగుతోంది. దీంతో, ఇంకా ఉద్యోగుల్లో అయోమయం కొనసాగుతోంది. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఎలా వినియోగిస్తారనే అంశం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Central minister Kumaraswmay visiting Steel plant focus on achieve full production and mines

ఎన్నో సందేహాలు
ఆగస్టులో ప్రారంభిస్తామని ప్రకటించిన బ్లాస్‌ ఫర్నేస్‌-3 కోసం అవసరమైన ముడిపదార్థాలను ఇప్పుడే కొనేయడానికి యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఇందుకు బీజేపీ నేతలు కొందరు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్‌ పాండ్రీ ప్లాంటులో ఎంపిక చేసిన 250 మంది యువ ఎగ్జిక్యూటివ్‌ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్రం ప్రకటించిన రూ.11,440 కోట్లు ప్యాకేజీని బ్యాంకుల రుణాలు, అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తారని తెలుస్తోంది.. గతంలో ఇచ్చిన రూ.1,650 కోట్లు కూడా ఈ ప్యాకేజీలో భాగమేనని చెబుతున్నారు. ఫర్నేసులను నడపాల్సిన బాధ్యత ఉద్యోగులదేనని తేల్చేసారు.

మంత్రి సమక్షంలో
జీతాలు, బకాయిలు, ఇంక్రిమెం ట్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. ప్లాంటుకు సొంత గనులు కేటాయించే పరిస్థితి లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. సెయిల్‌లో విలీనం కుదరదని క్లారిటీ ఇచ్చారు. ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం పార్లమెంట్ లో ఉందని.. ప్లాంట్ ను లాభాల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కార్మికులదేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పుడు కేంద్ర మంత్రులు ప్లాంట్ కు వస్తున్న వేళ కీలక అంశాలు వారి ముందుకు రానున్నాయి. ఉద్యోగుల పదోన్నతులో పాటుగా..వీఆర్ఎస్ అంశం చర్చకు రానుంది. ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం పైన ప్రధానంగా మంత్రి ముందు ప్రస్తావించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిసైడ్ అయ్యారు. దీంతో..కుమార స్వామి ఏం తేల్చబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+