జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం

గత కొన్ని సంవత్సరాలుగా భారత్ లో ఎక్కువగా నానిన అంశం ఏదైనా ఉందా? అంటే అది జమిలి ఎన్నికల విషయమే. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి స్పష్టతనిచ్చింది. జమిలి ఎన్నికలు నిర్వహించడం కష్టసాధ్యమని పార్లమెంటులో తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాని పనని తెలిపింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించారు. జమిలి ఎన్నికలపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

జమిలి ఎన్నికలతో లాభాలు ఉన్నప్పటికీ, ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పని కాదని మంత్రి వ్యాఖ్యానించారు. లాభాలు ఎన్ని ఉన్నాయో.. అవరోధాలు కూడా అన్నే ఉన్నాయని, అంతేకాకుండా జమిలి కోసం 5 కీలకమైన రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇందకు సమ్మతించాలి. నిర్వహణకు భారీ సంఖ్యలో ఈవీఎంలు, వీవీప్యాట్ ల అవసరం ఉంటుంది.

centralministerrammeghwal

ఒకేసారి అన్ని చోట్లా భద్రతా బలగాల మోహరింపు సాధ్యం కాదని జమిలిపై న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన చేసింది. సీఈసీ సహా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపింది. దీని తర్వాత విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనతో ఉందని మంత్రి చెప్పారు.

నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికల అంశం చాలాసార్లు చర్చకు వచ్చింది. అయితే వీటి నిర్వహణకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. పదవీకాలాన్ని వదులుకోవడానికి అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఇష్టపడలేదు. బీజేపీ అనుకూల ప్రభుత్వాలు రాష్ట్రాలు అంగీకరించాయికానీ.. ఇతర పార్టీలు ముందుకు రాలేదు. కొన్ని సంవత్సరాలుగా విషయం ఇలాగే నానుతుండటంతో కేంద్రం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+