ఏపీ వరదల వేళ కేంద్రం అనూహ్య నిర్ణయం..!!
ఏపీలో భారీ వర్షాలు..వరదల పైన కేంద్రం స్పందించింది. ఏపీలో వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం పంపాలని..తక్షణ సాయం చేయాలని లేఖ రాసారు. దీని పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. తక్షణ సాయం కోసం సిఫారసులు చేసేందుకు హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసారు. నేడు రాష్ట్రంలో ఆ టీం పర్యటించనుంది.
ఏపీకి కేంద్ర బృందాలు
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేసారు. ఈ బృందం వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యామ్ భద్రత తదితర అంశాలను అక్కడికక్కడే అంచనా వేయడానికి వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తుందని చెప్పారు.

క్షేత్ర స్థాయి పర్యటన
రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. పర్యటన తర్వాత తక్షణ సాయంపై కేంద్ర బృందం సిఫారసు చేస్తుందని తెలిపారు. ఏపీలో వరద పరిస్థితిపై సత్వరమే స్పందించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర బృందం సిఫార్సుల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. బాధిత ప్రజలకు సకాలంలో సహాయాన్ని అందించ డానికి కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వరద బాధితుల సంఖ్య 6.44లక్షలకు చేరగా వీరిలో 42,707 మందిని 193 సహాయక శిబిరాలకు తరలించారు.
కేంద్రానికి నివేదిక
కేంద్ర బృందం హోం శాఖ అదనపు కార్యదర్శి నవీన్ కుమార్ జిందాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ టీంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు కల్నేర్ కేపీ సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిద్దార్ద మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాద్ ఎస్ఈ ఎం రమేష్ కుమార్, ఎన్డీఎస్ఏ సదరన్ జోన్ డైరెక్టర్ గిరిధర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాడెంట్ ప్రసన్న సభ్యులుగా ఉన్నారు. ఈ టీం క్షేత్ర స్థాయిలో పర్యటన తరువాత ఈ సాయంత్రం సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ టీం నివేదిక ఆధారంగా కేంద్రం స్పందించనుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications