Prakasam Barrage: బోట్లు ఢీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిందా ? కేంద్రం రిపోర్ట్..
విజయవాడలో కృష్ణానది వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ ను మూడు బోట్లు ఢీకొన్నాయి. ఈ బోట్లు ఢీకొనడం వల్ల బ్యారేజ్ కు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆనకట్టల నిపుణుడు కన్నయ్యనాయుడిని పిలిపించి అధ్యయనం చేయించిన ప్రభుత్వం.. ఇవాళ కేంద్ర బృందం పరిశీలన కూడా పూర్తయి నివేదిక వస్తే తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కేంద్ర బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
కృష్ణానదికి గత వారం భారీగా వరద ప్రభావం ఉన్న సమయంలో గొల్లపూడి నుంచి మూడు బోట్లు వచ్చి బ్యారేజ్ ను గట్టిగా ఢీకొన్నాయి. ఢీకొన్న సమయంలో బోట్లు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు స్దానికులు తెలిపారు. ఈ బోట్లు ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టి అనంతరం బ్యారేజ్ గేట్లకు అడ్డంగా నిలిచిపోయాయి. దీంతో వరద ప్రవాహం గేట్ల నుంచి బయటికి పోకుండా అడ్డంకులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ బోట్లను వెంటనే బయటకు తీసే పరిస్ధితి లేదు.

బోట్లు బలంగా వచ్చి ఢీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజ్ పిల్లర్లకు పెచ్చులు ఊడాయి. అలాగే ఓ గేటుకు ఉన్న వెయిట్ కూడా కొంత జరిగినట్లు తేల్చారు. వీటికి తక్షణం వచ్చిన ప్రమాదమేదీ లేదని కన్నయ్యనాయుడు ఇప్పటికే నిర్ధారించారు. దీంతో కన్నయ్యనాయుడు ఇచ్చిన రిపోర్ట్ తో పాటు ఇవాళ కేంద్ర బృందం ఇచ్చే రిపోర్టు కూడా కలిపి అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతోంది. అది తగ్గితే తప్ప ఈ బోట్లను వెలికితీసే పరిస్ధితి లేదు. దీంతో ఈ బోట్లు బయటికి రావాలంటే మరికొన్ని రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.
బోట్లు ఢీకొట్టడం వల్ల ప్రకాశం బ్యారేజ్ దెబ్బతిందా ? కేంద్రం రిపోర్ట్..!!#PrakashamBarrage #VijayawadaFloods #VijayawadaRains #GovtOfIndia #AndhraPradesh #ApGovt pic.twitter.com/ABez8Kb2xk
— oneindiatelugu (@oneindiatelugu) September 5, 2024












Click it and Unblock the Notifications