ఏపీ అభ్యర్ధనకు ఢిల్లీ అంగీకారం, రంగంలోకి కేంద్ర బృందాలు..!!

ఏపీ అభ్యర్ధనకు కేంద్రం అంగీకరించింది. ఏపీలో జరిగిన నష్టం వేళ అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మొంథా తుఫాను తో ఏపీ నష్టపోయిన తీరు పై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. దాదాపు రూ 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు నివేదిక ఇచ్చింది. కాగా, కేంద్రం వెంటనే స్పందించింది. కేంద్ర బృందాలను రంగంలోకి దించింది. రెండు రోజుల క్షేత్ర స్థాయి పర్యటన తరువాత ఇచ్చే నివేదిక ఆధారంగా సాయం పైన నిర్ణయం తీసుకోనుంది. దీంతో, ఈ కేంద్ర బృందాల పర్యటన కీలకంగా మారుతోంది.

రాష్ట్రంలో మొంథా తుపాను నష్టాల అంచనాకు నవంబరు 10, 11 తేదీల్లో కేంద్ర బృందం ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. తుఫాను కారణంగా ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో నష్టాల్ని బృందం పరిశీలించనుంది. ఏపీ ప్రభుత్వం సేకరించిన నష్టం వివరాల మేరకు రూ 5,265 కోట్ల మేర నష్టం జరిగినట్లు గుర్తించారు. కేంద్రం సాయం కోరుతూ నివేదిక సమర్పించారు. దీంతో.. ఏపీకి వస్తున్న కేంద్ర బృందాలు ఆరు జిల్లాల్లో పర్యటించేలా షెడ్యూల్ ఖరారైంది.

central-teams-to-visit-montha-cyclone-affected-areas-in-six-districts-for-two-days

రెండు టీంలు ఈ పర్యటన చేయనున్నాయి. తుఫాను కారణంగా అత్యధి కంగా కృష్ణా జిల్లాలో 31,033, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422, తూర్పుగోదావరిలో 15,666, బాపట్లలో 13,258, ప్రకాశంలో 12,280, నంద్యాలలో 11,447, పశ్చిమగోదావరిలో 8,958, ఏలూరులో 5,671, ఎన్టీఆర్‌ జిల్లాలో 5,039 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు గుర్తించింది.

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం రెండు బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ సెంటర్‌లో కేంద్ర బృందానికి సంక్షిప్త సమా చారం ఇచ్చేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులంతా హాజరు కావాలని నిర్దేశించారు.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఎడుగురు సభ్యులతో కూడిన బృందం పర్యటన చేయనుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. సోమవారం టీం-1 బాపట్ల జిల్లాలో, టీం-2 కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించ నున్నట్లు తెలిపారు. మంగళవారం టీం-1 ప్రకాశం జిల్లాలో , టీం-2 కోనసీమ జిల్లాల్లో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+