Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలవరం పై ఏపీకి కేంద్రం బిగ్ అప్డేట్ - వాట్ నెక్స్ట్..!!

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పై కీలక నిర్ణయం జరిగింది. డయాఫ్రం వాల్ నిర్మాణం పనులు ముందుకు సాగనున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ నిర్మాణం పూర్తయ్యేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. ఈ మేరకు కేంద్ర జల సంఘం తమ నిర్ణయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టం చేసింది. దీని పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రేపు ( శనివారం) నుంచే పనులు ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది.

పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణం పై నిర్ణయం జరిగింది. ప్రాజెక్టులో అనేక తర్జన భర్జనల తరువాత డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది.సెంట్రల్‌ సాయిల్‌-మెటీరియల్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్నే నిర్మాణంలో ఉపయోగించాలని కేంద్ర జల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి తన నిర్ణయాన్ని తెలియజేసింది. దీంతో, సీఎం చంద్రబాబు ఆమోదిస్తే రేపటి నుంచే ఈ పనులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు యంత్రాలు, నిపుణులను కూర్చుకున్న బావర్‌ సంస్థ కూడా ఇందుకు సంసిద్ధంగా ఉంది.

Central water Commission key recommendation for PPA over Polavaram diaphragm wall works

డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ఎల్‌ అండ్‌ టీ సంస్థతో కలసి బావరే టీ-5 మిశ్రమాన్ని ఉపయోగిం చింది. ఇప్పుడూ ఇదే వాడాలని జల సంఘం ఆదేశించింది. కానీ, కాంక్రీట్‌ మిశ్రమంపై అమెరికా, కెనడా నిపుణులకు అవగాహన లేదని పీపీఏ, జల వనరుల శాఖ తో పాటుగా కేంద్ర సంస్థలు తమ అభిప్రాయం వెల్లడించాయి. గతంలో జలసంఘం బాధ్యతలు చేపట్టిన ఏబీ పాండ్యా మాత్రం ఆ నిపుణుల మాటకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. వారు టీ-16 మిశ్రమాన్ని వాడాలని సూచించారు. కాగా.. అంతర్జాతీయ నిపుణులు పోలవరంపై ఇప్పటిదాకా ఇచ్చిన సలహాలన్నీ వృథాగా మిగిలిపో యాయని నిపుణులు పేర్కాంటున్నారు.

అయితే పనులు ఇప్పుడు రెండు వారాలు ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాది చివరిలోగా డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తిచేసి తీరాలని బావర్‌కు జలవనరుల శాఖ లక్ష్యం విధించింది. ఇప్పుడు కేంద్ర జల సంఘం ఆమోదంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ డయాఫ్రం వాల్ నిర్మాణం పైన ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన తాజా సమాచారం పైన ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇరిగేషన్ అధికారులు ఈ మేరకు ముఖ్యమంత్రికి తాజా ప్రతి పాదన పైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా ఆలోచనకు ఆమోదం తెలిపితే.. రేపటి నుంచే పనులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ నిర్మాణం ఇప్పుడు ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యంలోకా పూర్తి చేసేందుకు కీలకంగా మారుతోంది. దీంతో.. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం పైన ఆసక్తి కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+