ఎన్నికల వేళ రాజమండ్రిపై నరేంద్రమోడీ వరాల జల్లు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. తెలుగుదేశం-జనసేనతో కలిపి కూటమిగా ఏర్పడిన భారతీయ జనతాపార్టీ రాష్ట్రానికి ఏ వరాలు ప్రకటించాలనే విషయమై సమాలోచనలు జరుపుతోంది. చిలకలూరిపేటలో జరిగే బహిరంగసభలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖ రైల్వేజోన్ తోపాటు ప్రత్యేక హోదా గురించికానీ లేదంటే ఆర్థికంగా రాష్ట్రానికి వెసులుబాటు కల్పించే విషయానికి సంబంధించికానీ ప్రకటన చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోడీ రైళ్ల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాప్స్ ఇచ్చారు. పూరీ-తిరుపతి(17479), తిరుపతి-పూరీ(17480), బిలాస్ పూర్-తిరుపతి(17481), తిరుపతి-బిలాస్ పూర్(17482) రైళ్లు ఇకనుంచి కొవ్వూరు స్టేషన్లలో కూడా ఆగనున్నాయి. ఈ స్టేషన్లలో ఎంత మంది ప్రయాణికులు ఈ రైళ్లు ఎక్కుతారు? ఎంత ఆదాయం వస్తుంది? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆశించినమేరకు పర్వాలేదనిపిస్తే భవిష్యత్తులో అలాగే కొనసాగిస్తారు.

centre good decision for rajahmundry

కొవ్వూరుకు సమీపంలోని రాజమండ్రిలో రామేశ్వరం - భువనేశ్వర్ - రామేశ్వరం(20895/20896), హౌరా - పుదుచ్చేరి -హౌరా (12867/12868) రైళ్లకు హాల్ట్ ఇచ్చారు. రాష్ట్రంలోని మరికొన్ని స్టేషన్లలో కూడా కీలకమైన రైళ్లకు హాల్టింగ్ కల్పించారు. అలాగే సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య తిరుగుతున్న రెండు వందే భారత్ రైళ్లకు కూడా రాజమండ్రిలో హాల్ట్ ఇచ్చారు. విజయవాడ-విశాఖపట్నం మధ్యలో కీలకమైన స్టేషన్ గా ఉన్న రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ పోటీచేయబోతోంది. సాధ్యమైనన్ని వరాలు ఇవ్వడంద్వారా ఎన్నికల సమయానికి వాతావరణాన్ని అనుకూలంగా మరల్చుకోవాలనే యోచనలో బీజేపీ నేతలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+