ఏపీకి కేంద్రం 'ఎల్ఈడీ' సాయం, మోడీకి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 24 మున్సిపాలిటీలలో ఎల్ఈడీ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం లక్షా 85వేల వీధిలైట్ల స్థానంలో ఎల్ఈడీ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎల్ఈడీ లైటింగ్ బల్పులను పది రూపాయలకే ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కేంద్రం ఇవ్వనున్న ఎల్ఈడీ బల్బు ధర బహిరంగ మార్కెట్లో రూ.400 వరకు ఉంటుందని సమాచారం. వీటిని కేంద్రం ఏపీకి కేవలం పది రూపాయలకే ఇవ్వనున్నదని తెలుస్తోంది. వీటి కోసం ఏపీకి కేంద్రం వెయ్యికోట్ల రూపాయలను సాయం చేయనుంది. వీటిని రాష్ట్రంలోని 24 మున్సిపాలిటీలలో ఏర్పాటు చేస్తారు.

జల పరిరక్షణ మిషన్
జల పరిరక్షణ మిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా భూగర్భ జలాలను అడుగంటకుండా చూడాలని ప్రభుత్వం ఈ ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, అటవీశాఖలు సంయుక్తంగా దీన్ని నిర్వహించనున్నాయి. దీనికి ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు పికె అగర్వాల్ వ్యవహరిస్తారు. విధివిధానాలపై కసరత్తు చేస్తున్నారు.
చెల్లింపులు నిలిపేసిన ఏపీ
నిధులు లేకపోవడంతో బిల్లుల చెల్లింపులను ఆంధ్రప్రదేశ ప్రభుత్వం నిలిపివేసినట్లుగా సమాచారం. తొమ్మిది నెలల నుంచి మంజూరైన బిల్లులను, ప్రాజెక్టులకు సంబంధించిన పథకాలకు చెల్లింపులను నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది.
మోడీకి కిషన్ రెడ్డి లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. పోలవరం డిజైన్‌లో కొంత మార్పులు చేయాలని ఆ లేఖలో కిషన్ రెడ్డి కోరారు. ప్రాజెక్టు డిజైన్‌ను కొద్దిగా మార్చితే ముంగు ప్రాంతాలు తగ్గుతాయని చెప్పారు. రెండు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పోలవరం డిజైన్ ఉండాలని కోరారు.












Click it and Unblock the Notifications