ఎంపీలకు కేంద్రం గుడ్ న్యూస్- జీతభత్యాలు, పెన్షన్ పెంపు ఇలా..!
పార్లమెంట్ సభ్యులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఎంపీల జీత భత్యాలు, పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతం ఉన్న జీత భత్యాలు, పెన్షన్లు పెరగబోతున్నాయి. పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల ప్రకారం కేంద్రం ఇవాళ పార్లమెంటు సభ్యుల నెలవారీ జీతం రూ.1 లక్ష నుండి రూ.1.24 లక్షలకు పెంచింది. పెరుగుతున్న జీవన వ్యయాలు, ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. జీతాల పెంపుతో పాటు, పార్లమెంట్ సమావేశాలు, అధికారిక విధుల సమయంలో అయ్యే ఖర్చులను కవర్ చేయడానికి ఉద్దేశించిన ఎంపీల రోజువారీ భత్యం కూడా రోజుకు రూ.2,000 నుండి రూ.2,500కి పెంచారు.

వీటికి అదనంగా సిట్టింగ్, మాజీ ఎంపీల నెలవారీ పెన్షన్ రూ.25000 నుండి రూ.31,000కి సవరించారు. ఈ సవరణను లోక్‌సభ సెక్రటేరియట్ ఆమోదించింది. దీంతో తక్షణమే అమల్లోకి రానుంది. ఎంపీల జీత భత్యాలు, పెన్షన్లు పెంచి చాలా కాలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెన్షన్ పెంపుతో భారీగా ఎంపీలకు ప్రయోజనం చేకూరబోతోంది. వీరిలో చాలామంది జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ పెన్షన్ పెరగకపోవడంపై ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తాజా నిర్ణయాన్ని అధికార, ప్రతిపక్ష ఎంపీలు స్వాగతిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి నిర్ణయాల్లో పారదర్శకత , బహిరంగ పరిశీలన అవసరమని చెప్తున్నారరు. జీవన వ్యయ సమస్యలు, బడ్జెట్ కేటాయింపులు, విస్తృత ఆర్థిక ఆందోళనలపై ప్రభుత్వం కూడా బహిరంగ చర్చలను ఎదుర్కొంటున్న సమయంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications