టి, ఎపి జగడం: కేంద్రం గుప్పిట్లోకి!, ఇప్పటికే రెండు...
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతున్న వివిధ అంశాలు ఒక్కటొక్కటిగా కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని పెంచేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
నాగార్జున సాగర్ నుంచి కృష్ణాడెల్టాకు తాగునీటి విడుదల వివాదంతో రిజర్వాయర్ల నిర్వహణను కృష్ణానది యాజమాన్య బోర్డు తన ఆధీనంలోకి తీసుకుంది. తాజాగా విద్యుత్తు పంపిణీ వంతు వచ్చింది. పీపీఏల వివాదం కారణంగా విద్యుత్ పంపిణీని బెంగళూరులోని దక్షిణ ప్రాంతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం తన చేతదుల్లోకి తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన నేపథ్యంలో విద్యుత్తును తెలంగాణకు 53.89 శాతం, ఎపికి 46.11శాతం కేటాయించారు. విద్యుత్తు పంపిణీలో వాటా నిర్ణయించడంలో తమకు అన్యాయం జరిగిందని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిస్కంలతో ఎపిజెన్కో చేసుకున్న పీపీఏ ఒప్పందాలను రద్దు చేయాలని కోరుతూ ఏపీఈఆర్సీకి లేఖ రాసింది.
పీపీఏలు రద్దు చేసుకొని కొత్తగా ఒప్పందాలు చేసుకుంటే ఇందులో తెలంగాణలోని డిస్కంలకు వాటా ఉండదు. దీనిపై తెలంగాణ రాష్ట్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం కల్పించుకోవాల్సి వచ్చింది. మొత్తానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదలతో కేంద్రం జోక్యం పెరిగే ఆవశ్యకత ఏర్పడింది.












Click it and Unblock the Notifications