వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ బాబు!: గంటల్లో మోడీ, స్మృతి... వీరితో(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం బిజిబిజీగా గడిపారు. పలువురు కేంద్రమంత్రులతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సుడిగాలి పర్యటనలో.. పదిహేనుమంది మంత్రులను కలిశారు. పదిహేను గంటల్లో 15 మంది మంత్రులను కలిసి.. వారి నుండి ఆంధ్రప్రదేశ్‌కు సహకారం కోరారు.

శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు హైదరాబాద్‌లోని నివాసంలో నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత న్యూఢిల్లీలో తాజ్‌మాన్ సింగ్ హోటల్‌లో విడిది చేసే వరకు బాబు సుమారు 20 గంటల పాటు సుడిగాలి పర్యటన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో సహా 15 మంది కేంద్రమంత్రులతో వరుసగా భేటీ కావడంతోపాటూ 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డితోనూ బాబు సమావేశమయ్యారు.

ప్రతి భేటీలోనూ ఆంధ్రప్రదేశ్ అవసరాలను వివరించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మధ్యాహ్నం 1.15కు బాబుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. సమయం మించిపోవటంతో ఆయన మోడీని కలిసేందుకు వెళ్లిపోయారు. దీంతో ముండేను కలిసేందుకు వచ్చిన బాబు ఏపీ భవన్‌కు వెళ్లిపోయారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవాలని భావించినప్పటికీ సాధ్యం కాలేదు. బాబు వెంట కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, అవంతి శ్రీనివాస్, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్, ఎమ్మెల్యే పితాని ఉన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిశారు. మోడీని సాయంత్రం కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిశారు. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను సాయంత్రం కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

శుక్రవారం ఉదయం ఢిల్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు అర్ధరాత్రి వరకు వరుస సమావేశాలు, భేటీలతో బిజీబిజీగా గడిపారు. ప్రధాన మంత్రి మోడీతోపాటు దాదాపు 15 మంది కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

శుక్రవారం ఉదయం ఢిల్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు అర్ధరాత్రి వరకు వరుస సమావేశాలు, భేటీలతో బిజీబిజీగా గడిపారు. ప్రధాన మంత్రి మోడీతోపాటు దాదాపు 15 మంది కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిశారు. జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతిని ఉదయం కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిశారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఉదయం కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకై త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరానన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

శుక్రవారం ఉదయం ఢిల్లీలో అడుగు పెట్టిన చంద్రబాబు అర్ధరాత్రి వరకు వరుస సమావేశాలు, భేటీలతో బిజీబిజీగా గడిపారు. ప్రధాన మంత్రి మోడీతోపాటు దాదాపు 15 మంది కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మోడీ, చంద్రబాబు భేటీలో అశోక గజపతి రాజు

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిశారు. మోడీని సాయంత్రం కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిశారు. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని ఉదయం కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిశానని, సీమాంధ్రకు తక్కువ విద్యుత్ ఇచ్చారని, ఆ మేరకు జరిగిన నష్టాన్ని కేంద్రమే భరించాలని సూచించానని తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

పెట్రోలియం శాఖకు సంబంధించి గంగవరం వద్ద రూ.5 వేల కోట్లతో ఎల్ఎన్‌జీ టెర్మినల్ ఏర్పాటు చేయాలని, తద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని చెప్పానని వివరించారు. పెట్రోలియం కారిడార్‌ను ఏర్పాటు చేయాలని, అక్కడ పెట్టుబడుల్ని ప్రోత్సహించాలని, పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరినట్లు తెలిపారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu met Prime Minister Narendra Modi and a host of Cabinet ministers on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X