Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీపీపీకి జై కొట్టిన కేంద్రం.. రాష్ట్రానికి సంచలన లేఖ

పీపీపీ విధానం ఏపీలో కాక పుట్టిస్తుంది. వైసీపీ అధినేత జగన్ వార్నింగ్ తో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ అంశం. అయితే ఇలాంటి కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ పంపింది. 27 పేజీల ఈ లేఖలో పీపీపీ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ పై ముందుకు వెళ్లాలని సూచించడమే కాకుండా.. క్లియర్ కట్ ఆదేశాలు అందులో పొందుపరిచింది.

ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పీపీపీ మోడల్ అమలుపై వివరణాత్మక మార్గదర్శకాలతో కూడిన లేఖను కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి విజయ్ నెహ్రా, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్‌కు ఈ నెల 12న పంపించారు. లేఖకు అనుబంధంగా, వివిధ వైద్య సేవలను పీపీపీ ద్వారా గరిష్టంగా అందించేందుకు 27 పేజీల మార్గదర్శకాలు కూడా జత చేశారు.

Centre Pushes PPP Model to Expand Healthcare Services in Andhra Pradesh

వైద్య విద్య, వైద్య సేవల విస్తరణకు పీపీపీ అత్యంత ప్రభావవంతమైన సాధనమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇటీవల రాష్ట్రానికి రాసిన లేఖను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ లేఖకు కొనసాగింపుగానే తాజా సూచనలు పంపినట్లు కేంద్ర అధికారి తెలిపారు.

కేంద్రం కీలక సూచనలు

వైద్య సేవల డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న వసతులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఐదు కీలక రంగాల్లో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం సూచించింది.

న్యూక్లియర్ మెడిసిన్, మొబైల్ మెడికల్ యూనిట్లు (MMUs), దంత వైద్య సేవలు, రేడియాలజీ సేవలు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లను పీపీపీ మోడల్ ద్వారా విస్తరించాలని సూచించింది.

ఈ సేవలను Equip-Operate-Maintain (EOM), Operate & Maintain (O&M) విధానాల్లో అమలు చేయవచ్చని, 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో ప్రైవేట్ భాగస్వాములకు చెల్లింపుల విధానంపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.

న్యూక్లియర్ మెడిసిన్ & క్యాన్సర్ సేవలు

క్యాన్సర్, గుండె, నరాల వ్యాధులకు న్యూక్లియర్ మెడిసిన్ కీలకమని, అయితే ఈ సేవలు ముఖ్యంగా మధ్యతరహా, చిన్న పట్టణాల్లో తీవ్రంగా కొరతగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. క్యాన్సర్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో PET-CT, SPECT ఇమేజింగ్, రేడియోథెరపీ సేవలను గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

దంత వైద్య సేవలపై ఆందోళన

దేశంలో 60-90 శాతం వరకు ప్రజలు దంత సమస్యలతో బాధపడుతున్నా, అవసరమైన సేవలు అందడం లేదని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పరికరాలు, వైద్యుల కొరత ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీపీపీ ద్వారా దంత వైద్య సేవలను బలోపేతం చేయాలని సూచించింది.

డయాగ్నస్టిక్ సేవల విస్తరణ

వ్యాధి నిర్ధారణలో కీలకమైన ఎక్స్‌రే, సీటీ, ఎంఆర్ఐ వంటి పరికరాల లభ్యతను పెంచేందుకు కూడా పీపీపీ విధానం సమర్థవంతమని కేంద్రం అభిప్రాయపడింది.

క్యాన్సర్ డే కేర్ సెంటర్లు

క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా ముందస్తు స్క్రీనింగ్, చికిత్స కోసం డే కేర్ సెంటర్ల ఏర్పాటుకు పీపీపీ అనువైన మోడల్ అని కేంద్రం పేర్కొంది.

2027-28 నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడం కేంద్ర లక్ష్యం కాగా, 2025-26 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌కు 14 డే కేర్ సెంటర్లు మంజూరు చేసినట్లు లేఖలో వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+