జగన్‌కు మోదీ వరాలు - వరుసగా మరోసారి: ఆ ప్రచారానికి కౌంటర్..!!
న్యూఢిల్లీ: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు- ఈ మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారు. నిధుల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తోందంటూ మండిపడుతున్నారు. జీఎస్టీ బకాయిలు, రెవెన్యూ లోటు నిధుల మంజూరులో ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తోందనీ ధ్వజమెత్తుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ వైసీపీ ఎంపీలు రెవెన్యూ లోటు, జీఎస్టీ బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ లోటు భర్తీ.. వంటి అంశాలను ప్రస్తావించారు.

నిధుల విడుదల కోసం..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తోనూ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సకాలంలో నిధులను విడుదల చేస్తూ, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా డిమాండ్లు, విజ్ఞప్తులు ఫలిస్తోన్నట్టే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వరుసగా ఈ నెల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ లోటు గ్రాంట్ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు నిర్మల సీతారామన్ సారథ్యంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

879 కోట్లు..
ఏపీ సహా 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు గ్రాంట్‌ను మంజూరు చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. మొత్తంగా 7,183 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అయిదో ఆర్థిక కమిషన్ చేసిన సిఫారసుల మేరకు ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ తెలిపింది. ఇందులో ఏపీ వాటా 879.08 కోట్ల రూపాయలు. ప్రస్తుత సెప్టెంబర్ నెలకు సంబంధించిన మొత్తం ఇది. కిందటి నెలలో కూడా సరిగ్గా ఇంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు గ్రాంట్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు
ఈ నిధుల విడుదలతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగినట్టే. కేంద్రం తమకు నిధులను ఇవ్వట్లేదనే ప్రచారానికి కౌంటర్ ఇచ్చినట్టయింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే- వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటిన ముగిసే 2022-23లో ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు విడుదల చేసిన పీడీఆర్డీజీ నిధులు 43,100.50 కోట్ల రూపాయలు. మొత్తంగా మంజూరు చేయాల్సిన నిధులు 86,201 కోట్ల రూపాయలు.

రాష్ట్రాలవారీ బ్రేకప్..
ఇందులో 43,100.50 కోట్లను ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో విడుదల చేసింది. మిగిలిన మొత్తాన్ని దశలవారీగా చెల్లిస్తుంది. రాష్ట్రాలవారీగా చూస్తే.. అస్సాం-రూ.407.50, హిమాచల్ ప్రదేశ్-781.42, కేరళ-1,097.83, మణిపూర్-192.50, మేఘాలయా-86.08, మిజోరం-134.58, నాగాలాండ్-377.50, పంజాబ్-689.50, రాజస్థాన్-405.17, సిక్కిం-36.67, త్రిపుర-368.58, ఉత్తరాఖండ్-594.75, పశ్చిమ బెంగాల్-1,132.25 కోట్ల రూపాయలను గ్రాంట్‌ను విడుదల చేసింది.












Click it and Unblock the Notifications