కూటమి మెడకు సాయికృష్ణ లాకప్ డెత్..! హైకోర్టు డెడ్ లైన్-ఏం చెప్పబోతున్నారు ?

నెల రోజుల క్రితం విజయవాడలో కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ అనే రౌడీ షీటర్ ను ఇంటినుంచి బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్లో లాకప్ డెత్ (Vijayawada lockup death)చేసి శవాన్ని సైతం మాయం చేసేశారన్న ఆరోపణలు చంద్రబాబు (Chandrababu) సర్కార్ ను కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరడం, ఈ నెల 29న సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టాలని హెబియస్ కార్పస్ పిటిషన్ లో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం నష్టాన్ని వీలైనంత తగ్గించుకునే పనిలో పడింది.

పవన్ ఆగ్రహం..! సస్పెన్షన్, విచారణకు చంద్రబాబు ఆదేశాలు..!
పవన్ ఆగ్రహం..! సస్పెన్షన్, విచారణకు చంద్రబాబు ఆదేశాలు..!

గత నెలలో సాయికృష్ణను ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉండగా విజయవాడ పోలీసులు తీసుకెళ్లారు. దీంతో అతని తల్లి తన కుమారుడి కోసం విజయవాడ పోలీసుల చుట్టూ నెల రోజులుగా తిరుగుతూనే ఉంది. అయినా ఆచూకీ చెప్పకుండా వారు తిప్పించుకున్నారు. చివరికి సీపీ రాజశేఖర్ బాబు ఆఫీసుకు వెళ్లినా అక్కడా ఆయన స్పందించలేదు. చివరికి హైకోర్టులో తన బిడ్డ ఆచూకీ కనుక్కునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి ప్రభుత్వం సాయికృష్ణ ఆచూకి కోసం రెండు వారాల గడువు ఇవ్వాలని అడిగింది. దీనికి హైకోర్టు కూడా సరే అంది. ఈ నెల 29న కోర్టులో సాయికృష్ణను ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

June 29 Haunts Chandrababu High Court Deadline Sparks Political Storm Over Vijayawada Lockup Death
గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్..!
గుడివాడ అమర్నాథ్ అరెస్టు తప్పదా ? అనిత వ్యాఖ్యలతో వైసీపీ రివర్స్ అటాక్..!

అయితే సాయికృష్ణను తీసుకెళ్లిన పోలీసులు అతన్ని లాకప్ డెత్ చేసి చంపేయడమే కాకుండా శవాన్ని సైతం తగుల బెట్టేశారన్న వార్తలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. దీనికి బాధ్యుడైన కృష్ణలంక సీఐ నాగరాజును అధికారులు వీఆర్ కు పంపి ఊరుకున్నారు. కానీ ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో నిన్న సీఎం చంద్రబాబు నాగరాజును సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించారు. దీంతో ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ను విచారణాధికారిగా నియమించారు. అయినా ఇప్పటికే చనిపోయాడని భావిస్తున్న సాయికృష్ణను పోలీసులు ఎన్ని విచారణలు చేస్తే మాత్రం హైకోర్టులో ఎలా ప్రవేశపెడతారు, విఫలమైతే కోర్టుకు ఏం చెప్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఈ కేసు సీబీఐకి అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+